వాళ్లు ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా.. బ్రహ్మాజీ కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంత అక్కినేని కుటుంబం గురించి మంత్రి కొండా సురేఖ ( Konda Surekha ) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

మంత్రి కొండా సురేఖ సమంత ( Samantha ) నాగచైతన్య విడిపోవడానికి కేటీఆర్ కారణం అంటూ ఆరోపణలు చేశారు.

అదే విధంగా అక్కినేని కుటుంబం గురించి ఈమె సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయంపై టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం కొండ సురేఖ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇలా ఇండస్ట్రీ మొత్తం సమంతకు అక్కినేని కుటుంబానికి మద్దతుగా నిలిచారు.ప్రస్తుతం ఇలాంటి వివాదం జరుగుతున్న కొండా సురేఖ మరోసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకు సమంత నాగచైతన్య విడాకులకు కారణాలు ఏంటో ఎవరికైనా చెప్పారా అంటూ మాట్లాడారు.

ఇక ఈ వీడియో పైకి నటుడు కమెడియన్ బ్రహ్మాజీ ( Bramhaji ) స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.వాళ్ళు ఎందుకు విడిపోయారు మీకు చెప్పాలా మేడం అంటూ కామెంట్ పెట్టారు.ఈ కామెంట్ పై నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందించారు.

Advertisement

ఒక నెటిజన్ అయితే ఏకంగా బూతు కామెంట్ చేయడంతో ఆ కామెంట్ కు బ్రహ్మాజీ రిప్లై ఇస్తూ నన్ను తిట్టాలంటే ఓన్ అకౌంట్‌తో, డీపీ పెట్టుకుని తిట్టాలని.ప్రభాస్‌ నా దేవుడు ఆయన డీపీ పెట్టుకుని నన్ను తిట్టితే అతన్ని తిట్టినట్టు అవుతుందని ఫ్యాన్స్ ఫీల్‌ అవుతారని రిప్లై ఇచ్చాడు.

పనిలో పనిగా మీ అమ్మను అడిగినట్లు చెప్పండి సార్ అంటూ ఈయన కౌంటర్ ఇస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ప్రస్తుతం బ్రహ్మాజీ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు