ఆంధ్ర వాడు అంటూ నాపై చిల్లర కామెంట్స్ చేశారు... నటుడు బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో నటుడిగా కమెడియన్ గా సపోర్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బ్రహ్మాజీ ( Brahmaji ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

సోషల్ మీడియా వేదికగా ఎలాంటి ట్వీట్ చేసినా ఏదైనా వేదికపై మాట్లాడిన భారీ స్థాయిలో నవ్వులు పూయిస్తూ మాట్లాడుతూ ఉంటారు.

ఇకపోతే తాజాగా ట్విట్టర్ వేదికగా ఈయన చేసినటువంటి ఒక ట్వీట్ తీవ్ర స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటుంది.ఇంతకీ ఈయన ట్విట్టర్ వేదికగా ఎలాంటి ట్వీట్ చేశారు అనే విషయానికి వస్తే గతంలో తాను బోటు కొనుక్కోవాలి అనుకుంటున్నాను సూచనలు ఇవ్వండి అంటూ ట్వీట్ చేశానని అయితే దానిపై చాలా విమర్శలు వచ్చాయి అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావ్( Sanjay Rao ) హీరోగా స్లమ్ డాగ్ హస్బెండ్( Slum Dog Husband ) అనే సినిమా ఈనెల 29వ తేదీ విడుదల కానుంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ఈ విషయం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

హైదరాబాదులో భారీ వర్షాల కారణంగా తాను తన భార్య కారులో ప్రయాణిస్తున్నాము అప్పటికే వర్షం ఎక్కువగా రావడంతో ఇంటికి వెళ్లే దారులని నీటితో నిండిపోయాయి దాంతో తెలిసిన వారి ఇంట్లో కారు పెట్టి పక్కనే ఉన్న వంతెన మీదగా మా ఇంటికి చేరుకున్నాము.అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాకు సహాయం చేశారు.ఇదే విషయాన్ని తాను సెటైరికల్ గా బోటు కొనుక్కోవాలి అనుకుంటున్నాను అంటూ దానికి హైదరాబాద్ రెయిన్ అనే ట్యాగ్ చేశానన్నారు.

అయితే ఈ విషయంపై తనని చాలామంది ట్రోల్ చేశారు.అప్పటికి నేను వివరణ ఇచ్చిన చాలామంది నన్ను ఆంద్రోడా అంటూ నాపై చిల్లర కామెంట్స్ చేశారని ఈ సందర్భంగా బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు