ఒక్క పూట భోజనం పెడితే నన్ను హీరోగా పెట్టి సినిమా తీశాడు : బ్రహ్మాజీ

ఈ కాలంలో ఎంత సహాయం చేసిన ఎవరు మనల్ని గుర్తు పెట్టుకోరు.లాభం ఉంటే తప్ప స్నేహం కూడా చేయరు.

డబ్బు ఉన్నవారినే ఈ సమాజం గుర్తిస్తుంది.స్వార్థం అనే పాదం పై నేటి సమాజం నడుస్తుంది.

కానీ కొంత పాత తరం అలా కాదు.చేసిన కాసింత సహాయం జీవితాంతం గుర్తు పెట్టుకునే వారు.

ఉదాహరణ చెప్పాలంటే దర్శకుడు కృష్ణ వంశీ తనకు ఒక్క పూట అన్నం పెట్టాడు అని నటుడు బ్రహ్మాజీ నీ హీరో గా పెట్టి ఏకంగా సినిమా తీసాడు.చెన్నై లో అవకాశాల కోసం బ్రహ్మాజీ మరియు కృష్ణ వంశీ వేరు వేరు గదుల్లో అద్దెకు ఉంటూ మొదట్లో ప్రయత్నాలు చేసేవారు.

Advertisement

అలా రోజు సాయంత్రం కలిసి ఎక్కడెక్కడ సినిమా అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే వారు.కృష్ణ వంశీ అప్పటికే డైరెక్టర్ గా చేయాలనే ఉద్దేశం తో రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం కోసం అవకాశం దొరుకుతుందేమో అని ప్రయత్నం చేసే వాడు.

ఆ టైం లో శివ సినిమా తీయడానికి రామ్ గోపాల్ వర్మ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాడు.ఇక ఆ టైం లో ప్రతి రోజు బ్రహ్మాజీ బైక్ పైన కృష్ణ వంశీ నీ దిగబెట్టే వాడు.

అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది.ఇక బ్రహ్మాజీ కి సినిమాల్లో అవకాశాలు రాలేదు కానీ ప్రతి నెల ఇంటి నుండి కొంత డబ్బు పంపించేవారు.దాని వల్ల అతడికి పెద్దగా సమస్యలు లేవు.

కేవలం సినిమా అవకాశాలు దొరకట్లేదు అని బాధ తప్ప.కానీ కృష్ణ వంశీ పరిస్థితి అలా కాదు.

పెసలతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. మరి వారానికి ఒక్కసారైనా వాటిని తింటున్నారా?

అతడికి తినడానికి తిండి కి కూడా ఉండేది కాదు.ఇంటి దగ్గర నుంచి డబ్బు వచ్చేది కాదు.ఏదైనా సినిమా మొదలైతే అక్కడ ఏదైనా పని దొరక్క పోతుందా అని ఎదురు చూసే వాడు.

Advertisement

ఒకసారి చేతిలో డబ్బు లేకపోవడం తో రెండు రోజులుగా అన్నం తినలేదు.ఆ టైం లో బ్రహ్మాజీ దగ్గర మాట్లాడుతూ కుర్చుకున్నాడట.భోజన సమయం కావడం తో వెళ్లి తిందాం పద అంటూ కృష్ణ వంశీ నీ అడిగాడట.

అప్పటికే రెండు రోజుల నుంచి తినకపోవడం తో అడగ్గానే ఓకే అని తినేసాడట.ఆ ఒక్క పూట భోజనం కృష్ణ వంశీ కి బ్రహ్మాజీకి ఎంతో అప్తుడిని చేసింది.

ఆ తర్వాత సింధూరం సినిమాతో బ్రహ్మాజీ నీ హీరోగా చేశాడు కృష్ణ వంశీ.అలాగే చంద్ర లేఖ సినిమాతో కమెడియన్ గా కూడా బ్రహ్మాజీ నీ మార్చాడు కృష్ణ వంశీ.

తాజా వార్తలు