ఫేడవుట్ అయిన యాక్టర్లకు ఓ రేంజ్‌లో ఎలివేట్ చేసిన బోయపాటి..

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ అవకాశాలు వస్తూనే ఉంటాయనుకుంటే పొరపాటే.ఒక సమయంలో ఒక వెలుగు వెలిగిన యాక్టర్ కొంత సమయానికి పూర్తిగా తెరమరుగు కావచ్చు.

అలా ఫేడవుట్ అయిపోయిన యాక్టర్లను ఏ దర్శకులు కూడా తిరిగి తీసుకురారు.కానీ బోయపాటి శ్రీను( Boyapati Srinu ) మిగతా దర్శకులకు పూర్తి భిన్నం.

ఆయన ఫేడవుట్ అయిన యాక్టర్లకు మరో ఛాన్స్ ఇస్తుంటాడు.వారికోసం అద్భుతమైన పాత్రలను రాసి వారిని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేస్తాడు.

మరి ఆయన తీసుకొచ్చిన ఫేడవుట్ యాక్టర్లు ఎవరు, వారు పోషించిన రోల్స్ ఏంటో తెలుసుకుందాం.

• అర్జన్ బజ్వా

Advertisement

ఈ యాక్టర్ తెలుగు చిత్రాల్లో దీపక్‌గా పాపులర్ అయ్యాడు.సంపంగి (2001) సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు.తర్వాత అర్జన్ కొన్ని సినిమాల్లో నటించాడు కానీ పెద్దగా గుర్తింపు లభించలేదు.

మూడు-నాలుగు సంవత్సరాలలోనే అసలు ఈ యాక్టర్ సినిమాల్లో నటిస్తున్నాడా అని ప్రేక్షకులు అనుకునేంతలా తెరమరుగయ్యాడు.అలాంటి సమయంలో బోయపాటి శ్రీను అర్జన్ బజ్వాకు( Arjan Bajwa ) ఒక అదిరిపోయే ఛాన్స్ ఇచ్చాడు.

భద్ర (2005)( Bhadra ) సినిమాలో హీరో ఫ్రెండ్, హీరోయిన్ అన్నయ్య పాత్ర ఆఫర్ చేశాడు.ఈ పాత్ర చాలా ముఖ్యమైనది.అందులో దీపక్‌ బాగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.దీని తర్వాత అరుంధతి సినిమాలో హీరోయిన్ అనుష్క శెట్టికి కాబోయే భర్తగా నటించాడు.

చేతుల‌ను తెల్ల‌గా, మృదువుగా మార్చే వాసెలిన్‌..ఎలాగంటే?

చివరగా తెలుగులో చిత్రాంగద సినిమాలో కనిపించాడు.

• వేణు తొట్టెంపూడి

Advertisement

చిరునవ్వుతో లాంటి మంచి ఫ్యామిలీ సినిమాలు తీసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు వేణు తొట్టెంపూడి.( Venu Thottempudi ) తర్వాత ఈ హీరో సినిమాలకి దూరమయ్యాడు.ఒకటి రెండు సినిమాల్లో చేసిన పెద్దగా గుర్తింపు రాక ఫేడౌట్ అయిపోయాడు.

అలాంటి సమయంలో బోయపాటి శ్రీను తన యాక్షన్ మూవీ "దమ్ము"లో( Dammu Movie ) మంచి ఆఫర్ ఇచ్చాడు.అలా చాలా సంవత్సరాలు తర్వాత వేణు జూ.

ఎన్టీఆర్‌కు బావ క్యారెక్టర్ లో మెరిశాడు.అయితే ఈ క్యారెక్టర్ బాగోలేదని, ఈ పాత్ర గురించి పూర్తిగా తెలిసి ఉంటే తాను అసలు ఈ సినిమాలో నటించి ఉండేవాడిని కాదని అతను తెలిపాడు.

ఈ మూవీలో వేణు తొట్టెంపూడిని బాగానే ఎలివేట్ చేశారు.

• తులసి - శివాజీ

మాజీ నటుడు శివాజీ( Actor Shivaji ) తులసి సినిమా వచ్చేనాటికి హీరోగా ఫేడౌట్ అయిపోయాడు.అలాంటి సమయంలో బోయపాటి శ్రీను కలిసి సినిమాలో నయనతార బ్రదర్ గా నటించే అవకాశం ఇచ్చాడు.ఈ మూవీలో మళ్లీ శివాజీ బాగా ఎలివేట్ అయ్యాడు.

• వినయ విధేయ రామ

ఈ మూవీతో జీన్స్ సినిమా హీరో ప్రశాంత్( Hero Prashanth ) రీఎంట్రీ ఇచ్చాడు.ఇందులో చెర్రీ బ్రదర్ కొణిదెల భువన్ కుమార్ గా ప్రశాంత్‌ నటించి మెప్పించాడు.చరణ్ రెండవ సోదరుడుగా ఆర్యన్ రాజేష్ యాక్ట్ చేశాడు ఈ సినిమాతో వీరిద్దరూ మళ్లీ లైమ్‌ లైట్ లోకి వచ్చారు.

• జగపతిబాబు - లెజెండ్

లెజెండ్ సినిమాకి( Legend Movie ) ముందు వరకు జగపతిబాబు( Jagapathi Babu ) కాళీగా సమయం గడిపారు.ఇక ఆయన పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో లెజెండ్ సినిమాలో విలన్ రోల్‌ ఇచ్చి అతన్ని వేరే లెవెల్‌లో ఎలివేట్ చేశాడు బోయపాటి శ్రీను.తర్వాత జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ కి తిరుగులేకుండా పోయింది.

తాజా వార్తలు