11 సార్లు ముఖాముఖిగా నాగార్జున‌ V/S చిరంజీవి…ఎవ‌రి సినిమాలు హిట్? ఎవ‌రిది పైచేయి!

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో చిరంజీవి, నాగార్జున టాప్ హీరోలు.త‌మ న‌ట‌న‌తో చిరంజీవి మెగాస్టార్‌గా, నాగార్జున యువ సామ్రాట్‌గా వెలుగు వెలిగారు.

చిరంజీవి మాస్ హీరోగా గుర్తింపు పొందారు.నాగార్జున‌కు యూత్‌లో ఫాలోయింగ్ బాగుండేది.

వీరిద్ద‌రి సినిమాలు 11 సార్లు ఓసారి రిలీజ్ అయ్యాయి.ఇంత‌కీ ఆ సినిమాలు ఎలా న‌డిచాయో ఇప్పుడు చూద్దాం!.1986లో చిరంజీవి న‌టించిన వేట, నాగార్జున న‌టించిన విక్ర‌మ్ సినిమాలు ఒకేసారి విడుద‌ల అయ్యాయి.చిరు మూవీ ఫ్లాప్ కాగా నాగ్ మూవీ హిట్ అయ్యింది.

అదే ఏడాది చిరు న‌టించిన చంట‌బ్బాయి, నాగార్జున న‌టించిన కెప్టెన్ నాగార్జున విడుద‌ల అయ్యింది.చిరు సినిమా యావ‌రేజ్‌గా ఆడ‌గా.

Advertisement
Box Office Fight Between Nagarjuna And Chiranjeevi-11 సార్లు ము

నాగ్ సిన‌మా ఫ్లాప్ గా నిలిచింది.ఇక 1987 లో నాగ్ అర‌ణ్య‌కాండ చిరు దొంగ‌మొగుడు విడుద‌ల‌య్యాయి.

నాగ్ సినిమా ఫెయిల్ కాగా, చిరు సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.అదే ఏడాదిలో నాగ్ – సంకీర్త‌న, చిరు-ఆరాధ‌న సినిమాలు విడుద‌ల అయ్యాయి.

ఈ రెండు సిన‌మాలూ ఫ్లాప్ గా నిలిచాయి.

Box Office Fight Between Nagarjuna And Chiranjeevi

1988 లో చిరు రుద్ర‌వీణ, నాగ్ ఆఖ‌రి పోరాటం రిలీజ్ అయ్యాయి.నాగ్ సినిమా సూప‌ర్ హిట్ కాగా చిరు సినిమా ఫెయిల్ అయ్యింది.అదే ఏడాది నాగ్ ముర‌ళీ కృష్ణుడు, చిరు ఖైదీనెంబ‌ర్ 786విడుద‌ల అయ్యాయి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

చిరు సినిమా సూప‌ర్ హిట్ కాగా నాగ్ మూవీ ఫ్లాప్ అయ్యింది.

Box Office Fight Between Nagarjuna And Chiranjeevi
Advertisement

1989లో చిరు అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు, నాగ్ విజ‌య్ సినిమాలు విడుద‌ల అయ్యాయి.నాగ్ మూవీ ఫ్లాప్ కాగా.చిరు మూవీ రికార్డుల‌ను తిరుగ‌రాస్తూ ఇండ‌స్ట్రీ హిట్ కొట్టింది.1990లో చిరు కొండ‌వీటి దొంగ విడుద‌లై సూప‌ర్ హిట్ అయ్యింది.నాగ్ ప్రేమ యుద్దం ఫ్లాప్ ఖాతాలో ప‌డింది.

1994లో చిరు న‌టించిన ము‌గ్గురు మొన‌గాళ్లు మూవీ యావ‌రేజ్ గా నిలువ‌గా నాగ్ న‌టించిన గోవిందా గోవిందా ఫ్లాప్ అయ్యింది.2006లో చిరు న‌టించి స్టాలిన్ యావ‌రేజ్ గా నిలువ‌గా నాగ్ న‌టించిన బాస్ ఫ్లాప్ అయ్యింది.

తాజా వార్తలు