స్టార్ డమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్.. చరణ్ చెప్పిందే నిజమంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ మల్టీస్టారర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.ఈ సినిమా నిర్మాత దానయ్యకు అంచనాలకు మించి లాభాలను అందించింది.

ఈ సినిమాపై ఇన్వెస్ట్ చేసిన మొత్తంతో పోల్చి చూస్తే సినిమా విడుదలకు ముందే 200 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల వరకు లాభాలు వచ్చాయి.పలు ఏరియాల్లో ఆర్ఆర్ఆర్ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కావడంతో కరోనా తర్వాత 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమా ఆర్ఆర్ఆర్ కావడం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ మూవీకి పోటీనిచ్చే సినిమాలు లేకపోవడం కూడా ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయింది.ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఒకే సినిమా కొరకు మూడు లేదా నాలుగేళ్లు కేటాయిస్తారా అనే ప్రశ్న ఎదురు కాగా స్క్రిప్ట్ ప్రకారం సినిమాకు అంత సమయం అవసరమైతే ఒక సినిమా కోసం మూడు నాలుగేళ్లు కేటాయిస్తామని చరణ్, తారక్ వెల్లడించారు.

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత స్టార్ డమ్ పెరిగిందా అనే ప్రశ్నకు చరణ్ స్పందిస్తూ తన దృష్టిలో స్టార్ డమ్ గురించి చెప్పుకొచ్చారు.ఉదయం 5 గంటలకు నిద్రలేచి 7 గంటలకు సెట్ లోకి అడుగుపెట్టి 7.30 గంటల సమయానికి ఫస్ట్ షాట్ పూర్తి చేసి సాయంత్రం కుటుంబంతో కొంత సమయం గడిపి నటుడిగా క్రమశిక్షణతో ఉండాలని చరణ్ అన్నారు.ఇదే తన దృష్టిలో స్టార్ డమ్ అని ప్రతిరోజూ ఇదే పని చేయడం బోరింగ్ గా ఉంటుందని చరణ్ కామెంట్లు చేశారు.

Advertisement

చరణ్ ఏదైతే చెప్పాడో ఆ విషయాలతో తాను ఏకీభవిస్తానని తారక్ వెల్లడించారు.

చరణ్ చెప్పిందే నిజమంటూ తారక్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.చరణ్ తారక్ ఎంత మంచి స్నేహితులో చెప్పడానికి ఇదే నిదర్శనమని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు