హైదరాబాద్ టీసీఎస్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్

హైదరాబాద్ లో బాంబు బెదిరింపు కాల్ తీవ్ర కలకలం సృష్టించింది.కొత్తగూడలోని టీసీఎస్ కంపెనీకి బెదిరింపు కాల్ వచ్చింది.

దీంతో అప్రమత్తమైన మాదాపూర్ పోలీసులు ఉద్యోగులను బయటకు పంపించి తనిఖీలు నిర్వహించారు.అయితే ఎటువంటి బాంబులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ ఉద్యోగి బెదిరింపు కాల్ చేసినట్లు గుర్తించారు.కావాలనే ఫేక్ కాల్ చేసినట్లు నిర్ధారించారు.

Advertisement