'పుష్ప 2'లో గెస్ట్ రోల్.. ఈ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ ను దింపుతున్న సుక్కూ!

స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ కాస్త పుష్ప ది రైజ్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా అవతరించాడు.

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ పుష్ప ది రైజ్.

ఈ సినిమా 2021 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కేవలం తెలుగులో మాత్రమే భారీ హైప్ తో రిలీజ్ అయ్యింది.

అయితే హిందీలో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే హడావిడిగా రిలీజ్ చేసారు.అయినప్పటికీ 100 కోట్ల మార్క్ చేరుకొని బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా ఎక్కేసింది.

మరి అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఎలా ఉండాలి.మరో రేంజ్ లో ఉండాలి కదా.ఇప్పుడు ఆ రేంజ్ లోనే సుకుమార్( Sukumar ) పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నాడు.నిర్మాతలకు భారీ లాభాలను అందించిన ఈ సినిమాను ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ మరింత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ వ్యాప్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

పుష్ప ది రూల్( Pushpa 2 ) పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఎప్పుడు ఏదొక అప్డేట్ వినిపిస్తూనే ఉంది.ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ రూమర్ నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా పాన్ ఇండియా కావడంతో భారీ తరగణాన్ని సుకుమార్ ఫైనల్ చేస్తున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

మరి ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడు అని టాక్.

ఈ సినిమాలో ఒక అతిథి పాత్ర ఉందట.ఈ పాత్రలోనే బాలీవుడ్ స్టార్( Bollywood ) గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.మరి ఇదే నిజమైతే పుష్ప 2 మరింత స్థాయికి చేరుకొని మరింత బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మరి పార్ట్ 1 తో అలరించిన అల్లు అర్జున్ పార్ట్ 2 తో ఎంత మంది అభిమానం అందుకుంటాడో వేచి చూడాల్సిందే.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు