నా కూతురి జోలికొస్తే మాత్రం ఊరుకోను.. అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్!

స్మార్ట్ ఫోన్ల ఎంట్రీతో సోషల్ మీడియా వినియోగం పెరిగింది.పల్లెల నుంచి పట్టణాల వరకు కోట్ల సంఖ్యలో ప్రజలు స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్నారు.

స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గింది.అదే సమయంలో కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీల గురించి హద్దులు మీరి కామెంట్లు చేస్తున్నారు.

కొందరు ఆ ట్రోల్స్ గురించి పట్టించుకుంటే మరి కొందరు మాత్రం ఆ ట్రోల్స్ గురించి స్పందించడానికి ఆసక్తి చూపడం లేదు.ఈ మధ్య కాలంలో కొంతమంది ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్యను ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.

ఆరాధ్య వంకరగా నడవగా ఆరాధ్య కాలికి ఏదో అయిందంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేశారు.ఐశ్వర్యారాయ్ కూతురు చెయ్యి పట్టుకుని నడిపించడం గురించి కూడా కొంతమంది ట్రోల్ చేయడం గమనార్హం.

Advertisement
Bollywood Star Hero Abhishek Bachchan Strong Warning To Trollers Details, Abhish

అయితే కూతురు గురించి వ్యక్తమవుతున్న ట్రోల్స్ పై అభిషేక్ బచ్చన్ స్పందించారు.ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ తాను పబ్లిక్ ఫిగర్ అని ట్రోల్ చేయాలనుకుంటే నన్ను ట్రోల్ చేయాలని చెప్పారు.

Bollywood Star Hero Abhishek Bachchan Strong Warning To Trollers Details, Abhish

తనను ఎంత ట్రోల్ చేసినా పడతానని అయితే తన కూతురును అనే హక్కు మాత్రం ఎవరికీ లేదని అభిషేక్ తెలిపారు.నా కూతురుకు మీకు ఎటువంటి సంబంధం లేదని అభిషేక్ బచ్చన్ చెప్పుకొచ్చారు.ఎవరైనా ట్రోలింగ్ చేయాలని అనుకుంటే తన ఎదురుగా వచ్చి చేయాలని అభిషేక్ బచ్చన్ వెల్లడించారు.

Bollywood Star Hero Abhishek Bachchan Strong Warning To Trollers Details, Abhish

బాలీవుడ్ మీడియాలో అభిషేక్ బచ్చన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.నెటిజన్లలో చాలామంది అభిషేక్ బచ్చన్ ను సపోర్ట్ చేస్తున్నారు.ఏ పాపం తెలియని చిన్నపిల్లల గురించి నెగిటివ్ కామెంట్లు చేయడం సరికాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

అభిషేక్ కామెంట్లతో ఆరాధ్యపై ట్రోల్స్ ఆగుతాయేమో చూడాలి.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !
Advertisement

తాజా వార్తలు