బాలీవుడ్ లో అవకాశాల పేరుతో వ్యభిచారం చివరికి....

దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై నగరంలో అసాంఘిక కార్యకలాపాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.

ఇందులో ముఖ్యంగా వ్యభిచార గృహాలు, అడ్డదారుల్లో సులభంగా డబ్బు సంపాదించలనుకునే వాళ్లు ఎక్కువగా ముంబై నగరాన్ని ఆశ్రయిస్తున్నారు.

తాజాగా అవకాశాల పేరుతో ఇద్దరు వ్యక్తులు బాలీవుడ్ సినీ పరిశ్రమలో అవకాశాలు పేరుతో మహిళలను వ్యభిచార కూపంలోకి దింపుతూ వారి చేత వ్యభిచారం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.వివరాల్లోకి వెళితే ముంబై నగరంలో స్థానికంగా ఉన్న ఉన్నటువంటి ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ లో  వ్యభిచారం జరుగుతోందంటూ పోలీసులకు సమాచారం రావడంతో ఆ హోటల్ పై పోలీసులు దాడి చేశారు.

ఈ దాడిలో భాగంగా వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మరియు నలుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.అయితే పోలీసులు వ్యభిచారం నిర్వహించే ఈ మహిళలను విచారించగా తమను బాలీవుడ్ సినీ పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తామని ఇద్దరు వ్యక్తులు ముంబై నగరానికి తీసుకు వచ్చారని ఆ తరువాత వ్యభిచారం చేయిస్తున్నారని, అంతేగాక వారికి సంబంధించినటువంటి వీడియోలను ఇంటర్నెట్లో పెడతామని బెదిరిస్తున్నారని దాంతో తమ పరువు గురించి ఆలోచిస్తూ తప్పక చేయాల్సి వస్తుందని ఆ మహిళలు వాపోతున్నారు.

దీంతో పోలీసులు ఆ మహిళలను పునరావాస కేంద్రానికి తరలించారు.అలాగే ఈ వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న టువంటి ఇతర వ్యక్తులను అరెస్టు చేసి ఇ పలు చట్టాలు కింద కేసు నమోదు చేసి విచారణ నిమిత్తమై రిమాండ్ కి తరలించారు.

Advertisement
సుకుమార్ ఇక మీదట చేసే మూవీస్ పుష్ప 2 కి మించి సినిమాను చేయాల్సిన అవసరం ఉందా..?

తాజా వార్తలు