తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇటీవల కాలంలో బాహుబలి తర్వాత ఒక రేంజ్ వచ్చేసింది.
అందుకే మన సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ నుంచి అనేక మంది హీరోయిన్స్ క్యూ కడుతున్నారు.
ఒక్కసారి మంచి సినిమా పడిందా ఇక వారి కెరియర్ మరో లెవెల్ లో ఉంటుంది అని వారి అభిప్రాయం.అందుకే సౌత్ ఇండియా పై బాలీవుడ్ హీరోయిన్స్ ఫోకస్ బాగా పెరిగిపోయింది.
ఇక బాలీవుడ్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంపోర్ట్ అయిన కొంతమంది హీరోయిన్స్ ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో డేటింగ్ చేస్తూ తమ కెరియర్ మరియు పర్సనల్ లైఫ్ తో బిజీ బిజీగా ఉన్నారు.మరి డేటింగ్ తో పాటు రిలేషన్ లో కూడా ఉన్న ఆ బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరు ? అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.అనన్య పాండేలైగర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి మొట్టమొదటగా పరిచయమైంది అనన్య పాండే( Ananya Pandey ).ఈ సినిమా పరాజయం పాలైన విజయ్ దేవరకొండ తో అనన్య కెమిస్ట్రీ మాత్రం గట్టిగా వర్కౌట్ అయింది స్క్రీన్ పైన వీరిద్దరిని చూసి తెలుగు ఆడియన్స్ పరవాలేదు అనుకున్నారు అయితే అనన్య ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్ తో డేటింగ్ లో ఉంది.వీరు త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు కూడా బాలీవుడ్లో చెక్కర్లు కొడుతున్నాయి.
తమన్నా భాటియామొదట్లో హిందీ సినిమాలతోనే ఇండస్ట్రీకి పరిచయమైన తమన్నా( Tamannaah ) ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ గా పదేళ్ల పాటు ఏకచత్రాధిపత్యం చేసింది.ప్రస్తుతం బాలీవుడ్లో ఆమె అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది.ఈ క్రమంలోనే తన తోపాటు నటించినా కోస్టార్ విజయ్ వర్మతో డేటింగ్ లో మునిగి తేలుతోంది.
శ్రద్ధ కపూర్2010 నుంచి హిందీ సినిమా ఇండస్ట్రీలో నటిస్తూ వస్తున్న శ్రద్ధ( Shraddha Kapoor ) 2019లో సాహో సినిమాతో తెలుగువారికి పరిచయమైంది.ఈ అమ్మడు ఫిలిం రైటర్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ అయిన రాహుల్ మోడీతో ప్రేమాయణం కొనసాగిస్తుంది అనే వార్తలు ప్రతి రోజు వినిపిస్తూనే ఉంటాయి.
దిశా పఠానిలోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ దిశా పఠాని( Disha Pathani ).ఈ అమ్మడు ప్రస్తుతం అలేస్కందర్ అనే ఒక ముంబై మాడల్ మరియు నటుడితో పీకల్లోతు ప్రేమలో ఉంది.
త్రిప్తి దిమ్రియానిమల్ సినిమాతో నేషనల్ క్రేజ్ సంపాదించుకుంది త్రిప్తి( Tripti Dimri ).అనుష్క శర్మ తమ్ముడు తో ఈ అమ్మడు డేటింగ్ చేస్తోంది.జాన్వీ కపూర్శిఖర్ పహరియ అనే సెలబ్రిటీ తో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్( Janhvi Kapoor ) చాలా రోజులుగా ప్రేమలో ఉంది వీరి గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు అయితే వస్తున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy