సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్( Rajinikanth ) అంటే అందరికీ ఎనలేని గౌరవం ఉంటుంది.
ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు గాని, ఆయన అందుకున్న అవార్డులు గాని దానికి నిదర్శనం గా చెప్పవచ్చు.
ఇక ఈయన కెరియర్ స్టార్టింగ్ లో చాలా మంచి సినిమాలు చేస్తూ ఆయన కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకొని అటు తమిళం లోనూ,ఇటు తెలుగులోనూ తనదైన మార్క్ నటనను చాటుతూ ముందుకు దూసుకెళ్లాడు.ఇక అటు కమల్ హాసన్( Kamal Haasan ) నుంచి ఇటు చిరంజీవి( Chiranjeevi ) నుంచి ఎదురయ్య పోటీని తట్టుకొని సూపర్ స్టార్ గా ఎదిగాడు అందుకే రజనీకాంత్ చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు.
ఇక ప్రస్తుతం రజనీకాంత్ 170 వ సినిమా చేస్తున్నాడు.అందులో భాగం గానే ఈ సినిమాలో నటించే వాళ్లలో రోజుకు ఒక స్టార్ పేరు వినిపిస్తుంది.ఇక ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా ఈ సినిమాలో మరో స్టార్ హీరో ఉండబోతున్నట్టు గా తెలుస్తుంది.
అయితే మొన్నటిదాకా నాని, ఫాహద్ ఫజిల్ లాంటి నటుల పేర్లు మాత్రమే వినిపించాయి.కానీ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ హీరో అయిన సైఫ్ అలీఖాన్ ( Saif Ali Khan )పేరు కూడా వినిపిస్తుంది.
అయితే ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ప్రభాస్ హీరోగా వచ్చిన ఆది పురుషు సినిమాలో రావణుడిగా నటించాడు.ఇక దానితోపాటు ఇప్పుడు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవర సినిమాలో ( Devara Movie )కూడా విలన్ గా నటిస్తున్నాడు.
ప్రస్తుతం ఇలా ఈయన ఈ సినిమాలో కూడా విలన్ గా చేస్తున్నాడు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ నెట్లో తెగ వైరల్ అవుతుంది.అయితే రజనీకాంత్ ( Rajinikanth )సినిమా అంటే మినిమం హైప్ ఉంటుంది అనడంలో సందేహం లేదు.అయితే సైఫ్ అలీ ఖాన్ ఈ మధ్య చాలా సినిమాల్లో విలన్ గా నటిస్తున్నాడు ఆయన్ని ఈ సినిమాలో కూడా విలన్ గా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఆయన ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అనేది తెలియాలంటే మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకు మనం వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy