Swara Bhaskar: తల్లి కాబోతున్న ప్రముఖ నటి స్వరా భాస్కర్.. ఆ నెలలోనే స్వాగతం పలుకుతామంటూ?

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్( Swara Bhaskar )  గురించి మనందరికీ తెలిసిందే.

ఈమె తను వెడ్స్ మను, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించి మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది.

అంతే కాకుండా ఈమె పలు సామాజిక అంశాలపై కూడా స్పందింస్తూ ఉంటుంది.ఈమె ఇటీవలే రాజకీయ నాయకుడు అయిన ప‌హాద్ అహ్మాద్ ను ( Fahad Ahmed ) సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

తర్వాత ఆలస్యంగా ఆ విషయాన్ని వెల్లడిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Bollywood Actress Swara Bhaskar Pregnant

ఇది ఇలా ఉంటే ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక చక్కటి శుభవార్తను తెలిపింది.తన తల్లి కాబోతున్న విషయాన్ని( Swara Bhaskar Pregnant ) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.త‌న భ‌ర్త ప‌హాద్ అహ్మాద్ తో క‌లిసి దిగిన ఫోటోల‌ను షేర్ చేస్తూ అభిమానులకు ట్వీట్ట‌ర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది.

Advertisement
Bollywood Actress Swara Bhaskar Pregnant-Swara Bhaskar: తల్లి కా�

ఈ సందర్భంగా ఆమె ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ.కొన్నిసార్లు మన‌ ప్రార్థనలన్నింటికీ సమాధానం లభిస్తుంది.మేము సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం.

Bollywood Actress Swara Bhaskar Pregnant

ఆశీర్వాదం, కృతజ్ఞత, ఉత్సాహం. #త్వరలో #కుటుంబం #అక్టోబర్ బేబీ అంటూ ట్వీట్ట‌ర్ వేదిక‌గా సంతోషాన్ని పంచుకుంది.ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్వర భాస్కర్‌, ఆమె భ‌ర్త‌ ప‌హాద్ అహ్మాద్ కు నెటిజన్స్, ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా స్వర భాస్కర్ నటిగా మనందరికీ సుపరిచితమే.ఆమె భర్త ఫహాద్ సమాజ్‌ వాదీ పార్టీ యువజన విభాగం నాయకుడు అన్న విషయం తెలిసిందే.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు