గుంజీలు తీసి, దండం పెట్టిన ఉపాధ్యాయుడు.. ఎందుకంటే?

ప్రస్తుత రోజుల్లో పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్‌ఫోన్లలో, టీవీలలో మునిగిపోతున్నారు.చదువంటే నిరాసక్తత పెరిగిపోతోంది.

ఉపాధ్యాయులు విద్యార్థులను చక్కదిద్దడానికి ఎంతగా ప్రయత్నించినా, సమాజం వారిని అర్థం చేసుకోవడం లేదు.ఇదే పరిస్థితిని బొబ్బిలి( Bobbili ) మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎదుర్కొన్నారు.

చదువుకోకుండా తిరిగే విద్యార్థుల కోసం తన నిరసనను భిన్నంగా వ్యక్తం చేశారు.ఇందుకు సంబంధించి ఓ వీడియో వైరల్ గా( Viral Video ) మారింది.

విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలం పెంటగ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమణ( Headmaster Ramana ) చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.విద్యార్థులు ఏమీ చదవడం లేదని, వారికి అక్షర ముక్క కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Bobbili Govt School Headmaster Self Punishment To Control Students Video Viral D

పిల్లలకు బుద్ధి చెప్పాలనుకుంటే తల్లిదండ్రులు, అధికారులు ఉపాధ్యాయులను తప్పుబడుతున్నారు.దీంతో తమకు ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆయన బాధపడిపోయారు.

Bobbili Govt School Headmaster Self Punishment To Control Students Video Viral D

విద్యార్థులు మనుగడకు అవసరమైన విద్యను కూడా అలవర్చుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.‘‘మీకు మేం ఏమీ చేయలేకపోతున్నందుకు నేను నాకు శిక్ష విధించుకుంటున్నా’’ అంటూ పిల్లలకు క్షమాపణ చెప్పారు.స్టేజ్‌పై తానే స్వయంగా గుంజీలు తీసి, ‘‘మేం కొట్టలేం, తిట్టలేం, ఏమీ చేయలేం.

మా దగ్గర చేతకాని వారిలా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది’’ అంటూ ఆవేదన చెందారు.

Bobbili Govt School Headmaster Self Punishment To Control Students Video Viral D

ఈ ఘటన ప్రస్తుత విద్యా వ్యవస్థలోని సమస్యలను అద్దం పట్టింది.ఉపాధ్యాయులు విద్యార్థులకు నైతిక విలువలు నేర్పాలని ప్రయత్నించినా, సమాజం నుంచి మద్దతు లభించకపోవడం బాధాకరం.ఉపాధ్యాయులను గౌరవించే సమాజం నిర్మించాల్సిన అవసరం ఉంది.

అయ్యాయో.. శోభనం రాత్రి కాళరాత్రిగా మారిందిగా!
Advertisement

తాజా వార్తలు