కేవలం 10 నిమిషాల్లోనే ఐఫోన్ -14 డెలివరీ చేసిన బ్లింకిట్.. సూపర్ ఫాస్ట్ అంటున్న నెటిజన్లు!

నిత్యావసర వస్తువులను ఎలాగైతే క్షణాల్లో వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తారో అదే మాదిరి యాపిల్‌ ఫోన్లను కూడా ఆర్డర్‌ చేసిన నిముషాల వ్యవధిలోనే మీ ముందు ఉంచుతానని బ్లింకిట్‌ ఏ ముహూర్తాన అందోగాని ఆ మాట నిలబెట్టుకొని టాక్ అఫ్ ది టౌన్ అయింది ప్రముఖ డోర్ డెలివరీ సంస్థ బ్లింకిట్.

అవును, యాపిల్‌ కొత్త ఐఫోన్‌ 14ను కూడా కేవలం నిముషాల్లోనే ఇంటికి తెచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఈ విషయాన్ని బ్లింకిట్‌ సంస్థ ఫౌండర్‌, CEO అల్బిందర్‌ దిండ్సా ట్విటర్‌ ద్వారా ఈ రోజు స్వయంగా వెల్లడించారు.తాజాగా యాపిల్‌ ఐ ఫోన్లను విక్రయించే యూనికార్న్‌ కంపెనీతో బ్లింకిట్‌ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసినదే.

దీంతో యాపిల్‌ ఫోన్‌తో సహా యాపిల్‌ వాచ్‌, ల్యాప్‌టాప్స్‌ వంటి ఇతర యాపిల్‌ యాక్సెసరీలను సైతం బ్లింకిట్‌ ద్వారా నిమిషాల్లో వినియోగదారునికి డెలివరీ చేయనున్నట్లు అల్బిందర్‌ దిండ్సా ఈ సందర్భంగా తెలిపారు.మన దేశంలో ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబయిలలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కాగా యాపిల్ ప్రొడక్ట్స్‌, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువును నిముషాల వ్యవధిలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా విక్రయించడం బ్లింకిట్‌ ఇది మొదటిసారి కావడం గమనార్హం.ఈ ఏడాది సెప్టెంబర్‌ 7న యాపిల్‌ పలు ప్రొడక్ట్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.మన దేశంలో వీటిని అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ వేదికలతో పాటు క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌ వంటి ఆఫ్‌లైన్‌ వేదికల్లోనూ అమ్మకాలు నిర్వహిస్తున్నారు.

Advertisement
న్యూస్ రౌండప్ టాప్ 20

తాజా వార్తలు