కొవ్వును వేగంగా కరిగించే మిరియాల టీని త్రాగితే అద్భుతాన్ని చూస్తారు

ఘాటైన వాసన,రుచి కలిగిన మిరియాలను ఎక్కువగా వంటలలో ఉపయోగిస్తూ ఉంటాం.ఎక్కువగా నాన్ వెజ్ వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు.

వంటలకు మంచి రుచిని కలిగిస్తుంది.మిరియాలను వంటల్లోనే కాకుండా టీ తయారుచేసుకొని త్రాగినా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

మిరియాల టీని ప్రత్యేకంగా తయారుచేసుకొనవసరం లేదు.మనం రోజు తయారుచేసుకునే టీలోనే కొంచెం మిరియాల పొడిని వేసి మరిగిస్తే సరిపోతుంది.

ఇప్పుడు ఈ టీ త్రాగటం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.అధిక బరువుతో బాధపడుతున్న వారికి దివ్య ఔషధం అని చెప్పవచ్చు.

Advertisement

మిరియాలు రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచుతుంది.కొవ్వును కరిగించే లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన బరువు తగ్గాలని అనుకునేవారు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.

అలాగే ఇది ఆకలిని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసి అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలను తొలగిస్తుంది.

జీవ క్రియలు మెరుగ్గా జరిగేలా చేస్తుంది.అంతేకాక కొవ్వు పదార్ధాలను సులభంగా జీర్ణం కావటానికి సహాయపడుతుంది.

దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.మిరియాలతో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వైరస్‌లు, బ్యాక్టీరియాతో పోరాటం చేయటానికి సహాయపడుతుంది.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన డిప్యూటీ సీఎం చిన్న కుమారుడు.. స్పందించిన మాజీ సీఎం

మిరియాలలో చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన ఒత్తిడిని తగ్గించటమే కాకుండా యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది.ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే జీర్ణాశయ సంబంధమైన శస్త్ర చికిత్సలు జరిగిన వారు మిరియాలను వాడకుండా ఉంటేనే మంచిది.

Advertisement

ఎందుకంటే వారికీ అలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు