తెలంగాణ సంక్షేమాన్ని బీజేపీ చీక‌ట్లోకి నెట్టేస్తుందిః మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

బీజేపీ కుట్ర‌ల‌ను అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల‌ని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు.తెలంగాణ అభివృద్ధిని, సంక్షేమాన్ని చీక‌ట్లోకి నెట్టేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు.

ప్ర‌జ‌ల మ‌ధ్య వైష‌మ్యాల‌ను రెచ్చ‌గొడుతోంద‌ని విమ‌ర్శించారు.ప్ర‌జ‌ల సంక్షేమానికి పాటు ప‌డుతున్న కేసీఆర్ పై అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.