ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రికి బీజేపీ అధిష్టానం షాక్

బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రికి పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది.ఛ‌త్తీస్‎గ‌ఢ్ బాధ్య‌త‌ల నుంచి ఆమెను పూర్తిగా త‌ప్పించారు.

ఇప్ప‌టికే ఒడిశా పార్టీ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ బాధ్య‌త‌ల్లో కోత‌లు విధించిన విష‌యం తెలిసిందే.2020 న‌వంబ‌ర్ నుంచి ఆమె ఛ‌త్తీస్‎గ‌ఢ్, ఒడిశా బీజేపీ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్‎లుగా ఉన్నారు.పురంధేశ్వ‌రి స్థానంలో రాజ‌స్థాన్‎కు చెందిన కీల‌క నేత ఓం మాథుర్‎ను ఛ‌త్తీస్ గ‌ఢ్ బీజేపీ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్‎గా నియ‌మిస్తూ హైక‌మాండ్ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా అక్క‌డి పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న అనంత‌రం ఇంఛార్జ్‎ను మారుస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త

తాజా వార్తలు