బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు దీక్ష..!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) చేపట్టిన రైతు దీక్ష ప్రారంభమైంది.ఈ మేరకు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగనుంది.

ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో కిషన్ రెడ్డి దీక్ష చేస్తున్నారు.రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం కొనసాగుతోంది.కాగా రూ.2 లక్షల రుణమాఫీతో పాటు వడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ చెల్లించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.అదేవిధంగా రైతు భరోసా( Rythu Bharosa ) కింద రూ.15 వేలు అందించాలని బీజేపీ కోరుతోంది.దాంతోపాటుగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు