తెలంగాణలో బిజెపి దూకుడు ! నియోజకవర్గ పాలక్ ల నియామకం 

తెలంగాణలో బిజెపి దూకుడు పెంచుతుంది.క్రమక్రమంగా తెలంగాణ అంతటా బలం పెంచుకుని రాబోయే ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ఉంది.

అందుకే తాము బలంగా ఉన్న నియోజకవర్గాలతో పాటు,  బలహీనంగా ఉన్న నియోజకవర్గాల పైన ప్రత్యేక దృష్టి సారించింది.కేంద్ర బిజెపి పెద్దలు తెలంగాణ విషయంలో ప్రతిష్టాత్మకంగా ఉండడంతో పాటు,  ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

తరచుగా తెలంగాణ అంతట పర్యటిస్తూ తమ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు.గతంతో పోలిస్తే తెలంగాణలో బిజెపి బాగా బలం పెంచుకోవడం కాస్త ఉపశమనం కలిగిస్తుంది.

ఈ క్రమంలోనే నియోజకవర్గాల వారీగా మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు భారీగానే ప్లాన్ చేసింది.       ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్ లను నియమించింది.

Advertisement

ఈ నియామకల్లో సీనియర్ల కు అవకాశం కల్పించారు.కుత్బుల్లాపూర్ - డీకే అరుణ, ఎల్లారెడ్డి రఘునందన్ రావు, రామగుండం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కల్వకుర్తి రామచందర్రావు, వరంగల్ తూర్పు ఈటెల రాజేందర్, ములుగు సోయం బాపూరావు, మేడ్చల్ - లక్ష్మణ్, శేర్ లింగంపల్లి కిషన్ రెడ్డి, పరిగి విజయశాంతి ఇలా అన్ని నియోజకవర్గాలకు ఒక్కో పాలక్ ను నియమించారు.   

   కొత్తగా పాలక్ గా బాధ్యతలు తీసుకున్న వారు ప్రతి నెల మూడు రోజులు పాటు వారికి కేటాయించిన నియోజకవర్గంలో పనిచేయాలి .ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల సాధక బాధలన్నీ తెలుసుకుంటూ వారిని ముందుకు నడిపించే బాధ్యత తీసుకోవాలి.అలాగే ఆర్థిక వనరులు,  కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను వీరే చూడాల్సి ఉంటుంది.

ఈ విధంగా క్షేత్రస్థాయిలోకి బిజెపిని తీసుకు వెళ్లే విధంగా ఆ పార్టీ హైకమాండ్ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది.రాబోయే తెలంగాణ ఎన్నికల వరకు ఏదో ఒక కార్యక్రమంతో నిత్యం జనాల్లో ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు