ఈనెల 28న తెలంగాణకు బీజేపీ జాతీయ నేతలు..!

తెలంగాణకు ఈనెల 28వ తేదీన బీజేపీ జాతీయ నేతలు రానున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్ లు రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం.

ఇటీవల చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు తర్వాత తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగిన సంగతి తెలిసిందే.కేసు విచారణ కొనసాగుతుండగానే బీఎల్ సంతోష్ తెలంగాణకు వస్తున్నారు.

మరోవైపు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అమిత్ షా, బీఎల్ సంతోష్ ల పర్యటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈనెల 28, 29న బీఎల్ సంతోష్ మకాం వేయనున్నారని తెలుస్తోంది.ఆయన వెంట సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ రానున్నారు.

Advertisement

అనంతరం హైదరాబాద్ లో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ లకు శిక్షణ ఇవ్వనున్నారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement