కాంగ్రెస్ ముక్త్ భారత్ త్వరలో సాధ్యం..: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP Lakshman ) కీలక వ్యాఖ్యలు చేశారు.

లోక్ సభ ఎన్నికలపై ఏ సర్వే చూసినా బీజేపీవైపే ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ ముక్త్ భారత్( Congress Mukt Bharat ) త్వరలో సాధ్యం కానుందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.దాదాపు 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి ఉందన్నారు.

కూటమిలో ఉన్న పార్టీలు సైతం కాంగ్రెస్ ను గౌరవించడం లేదని పేర్కొన్నారు.కాంగ్రెస్ 40 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని మమతా బెనర్జీ( Mamata Banerjee ) అన్నారన్న ఆయన తెలంగాణలో నేల విడిచి సాము చేసినట్లు కాంగ్రెస్ తీరు ఉందని విమర్శించారు.

రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కాబోయే ప్రధాని అంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతల కబుర్లు చెబుతున్నారన్నారు.ఇచ్చిన హామీలు నెరవేర్చలేక సతమతం అవుతున్నారంటూ ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.

Advertisement

నేతల మధ్య పొసగడం లేదన్న ఆయన రేవంత్ రెడ్డి అభద్రతా భావంలో ఉన్నారని తెలిపారు.బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగు కానుందన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ ది మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు