Etela Rajender KCR: ఎప్పుడైనా ఎక్కడైనా.. కేసీఆర్ కు ప్రత్యర్ధి ఈటెలే ? 

టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, ఆ తర్వాత హరీష్ రావు , ఈటెల రాజేందర్ వంటి వారు కీలకంగా ఉండేవారు.

తెలంగాణ ఉద్యమంలోనూ టిఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చేలా చేయడంలోనూ కేసీఆర్ తో పాటు , హరీష్ ఈటెల పాత్ర కూడా ఎక్కువ ఉండేది.

అయితే రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హరీష్,  ఈటెల రాజేందర్ కు కెసిఆర్ ప్రాధాన్యం తగ్గించారు.చాలా కాలం పాటు వీరిద్దరికి మంత్రి పదవులు కేటాయించలేదు.

దీనిపై పార్టీలోనూ తీవ్రమైన చర్చ జరిగినా,  కేసీఆర్ మాత్రం ఈ ఇద్దరు విషయంలోనూ సైలెంట్ గానే ఉన్నారు.ఆ తర్వాత దీనిపై పార్టీలో గందరగోళం నెలకొనడం,  ఆవిర్భావం నుంచి ఉన్న పార్టీ కీలక నేతల సైతం కెసిఆర్ తీరుపై అసంతృప్తితో ఉన్నారని కేసీఆర్ కు నివేదికలు అందాయి.

దీనికి తోడు పార్టీ బలహీనమవుతుండడం, బిజెపి బాగా బలపడుతుండడం, ఇవన్నీ లెక్కలు వేసుకుని కేసీఆర్ ఆ తర్వాతే ఇద్దరికీ మంత్రి పదవులు కేటాయించారు .కొంతకాలం తర్వాత ఈటెల రాజేందర్ కు మంత్రి పదవి తొలగించడంతో ఆయన అసంతృప్తితో పార్టీకి,  ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి బిజెపిలో చేరి హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బిజెపి నుంచి గెలిచారు.అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ నుంచి పోటీ చేసినా తానే బిజెపి తరఫున పోటీ చేస్తాను అంటూ రాజేందర్ అప్పట్లోనే సవాల్ చేశారు.

Advertisement

అయితే బిజెపి హై కమాండ్ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోకపోయినా , రాజేందర్ మాత్రం గజ్వేల్ నియోజకవర్గం కేంద్రంగా గత కొంతకాలంగా కార్యక్రమాలు ఇటీవల కాలంలో ఎక్కువగా ఈ నియోజకవర్గంలో పర్యటిస్తూ, అక్కడ చేరికలను ప్రోత్సహిస్తున్నారు.

అయితే తాజాగా బిజెపి హై కమాండ్ కూడా రాజేందర్ కు ప్రాధాన్యమిస్తూ కేసీఆర్ కు సరైన రాజకీయ ప్రత్యర్థ్యాన్ని భావించి కెసిఆర్ పై పోటీ చేసేందుకు అంగీకారం తెలిపిందట.అయితే కెసిఆర్ గజ్వేల్ లో పోటీ చేస్తారని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్న ఆయన ఎన్నికల సమయం నాటికి వేరే నియోజకవర్గానికి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా,  అక్కడ రాజేందర్ ని పోటీకి దింపేందుకు బిజెపి అధిష్టానం కూడా సముఖంగా ఉండడంతో, రాజేందర్  గజ్వేల్ తో పాటు కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించారట.

రాజేందర్ ను అన్ని విధాలుగా ప్రోత్సహించి కెసిఆర్ ను ఎమ్మెల్యేగా ఓడించాలనే లక్ష్యంతో బిజెపి ఉందట.   .

మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?
Advertisement

తాజా వార్తలు