వెంకయ్య అదే పాట

ఆమరణ నిరాహార దీక్ష భగ్నం చేసి జగన్ను ఆస్పత్రిలో చేర్చగానే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మళ్ళీ పాత పాట అందుకున్నారు.

ఆ పాట అందరికీ తెలిసిందే కదా.

ఆంద్ర ప్రదేశ్ను అన్ని విధాల ఆదుకుంటాం.అన్ని రకాల సహాయం చేస్తాం.

విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నేరవేరుస్తాం.ఇదీ వెంకయ్య పాట.కానీ ప్రత్యేక హోదా గురించి మాత్రం ఏమీ చెప్పలేదు.వాస్తవానికి చెప్పడానికి అవకాశం కూడా లేదు.

హోదా ఇవ్వకూడదని ఇదివరకే నిర్ణయించారు.ఒక వేళ ఇవ్వాలని అనుకున్నా అది చాలా పెద్ద ప్రక్రియ.

Advertisement

కాబట్టి హోదా మీద ఏమీ మాట్లాడకుండా అన్ని హామీలు నేరవేరుస్తాం అని జనరల్ గా చెబుతుంటారు.హోదా కోసం జగన్ చేస్తున్న పోరాటం ఆగదని, జగన్ కోలుకున్న తరువాత పోరాటం ఉధృతం అవుతుందని జగన్ సోదరి షర్మిల చెప్పింది.

జగన్ దీక్షను మెచ్చుకోవలసిన చంద్ర బాబు దాన్ని భగ్నం చేసారని మండి పడింది.గత ఎన్నికల తరువాత నోరు మూసుకొనే ఎవ్వరికీ కనబడకుండా ఉన్న మాజీ ఎంపీ విజయశాంతి జగన్ దీక్షకు మద్దతు ఇచ్చినట్లు వార్త వచ్చింది.

ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర ప్రజలు పోరాడాలని విజయశాంతి అన్నది.ఒకప్పుడు ఆంధ్రాను తిట్టి పోసిన ఈ మాజీ హీరోయిన్ ఇప్పుడు సానుభూతి చూపిస్తున్నది.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

తాజా వార్తలు