బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావోద్వేగం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ఈ క్రమంలో ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.

బండి సంజయ్ ను చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయన్నారు.బండి సంజయ్ ఉన్నత స్థానంలో ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

బండి సంజయ్ కారణంగానే తెలంగాణలో బీజేపీ బలపడిందని చెప్పారు.అనంతరం కిషన్ రెడ్డి మచ్చ లేని నాయకుడన్న రాజగోపాల్ రెడ్డి ఆయన నాయకత్వంలో పని చేస్తామని తెలిపారు.

తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడేందుకే తాను బీజేపీలో చేరానని వెల్లడించారు.

Advertisement

కేటీఆర్, కవితను జైలుకు బీజేపీ పంపిస్తుందని తెలిపారు.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త
Advertisement

తాజా వార్తలు