ఏపీలో బీజేపీ ఖేల్ కతం ?

ఏపీలో బీజేపీ( AP bjp ) పని అయిపోయిందా ? ఆ పార్టీ ఒకటి తలిస్తే ఇంకోటి జరుగుతోందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న పవన్ ఊహించని విధంగా టీడీపీతో పొత్తును ఒకే చేశారు.

ఇన్నాళ్ళు తమ పొత్తు బీజేపీతోనే అని చెబుతూ వచ్చిన జనసేనాని అనూహ్యంగా టీడీపీతో పొత్తును కన్ఫర్మ్ చేయడం కమలనాథులు అసలు ఊహించని పరిణామమే.మొదటి నుంచి కూడా జనసేన అండతో ఏపీలో బలపడాలని చూస్తున్న కాషాయ పార్టీకి ఇది ఏ మాత్రం రుచించని విషయం.

ఇప్పుడు బీజేపీ ముందున్న దారులు రెండే.ఒకటి టీడీపీ జనసేన పొత్తుకు సై అంటూ కూటమిగా ఏర్పడడం లేదా జనసేనతో ఉన్న పొత్తును క్యాన్సిల్ చేసుకొని సింగిల్ గా బరిలోకి దిగడం.

ఈ రెండిట్లో ఏదో ఒక దానిని తేల్చుకోవవడం బీజేపీకి అంతా తేలికైన విషయం కాదు.ఎందుకంటే గత ఎన్నికల తరువాత టీడీపీతో కలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆ పార్టీ పెద్దలు గత కొన్నాళ్లుగా టీడీపీ బీజేపీని కలిపే ప్రయత్నం పవన్ చేసినప్పటికీ పెద్దగా ఫలించలేదు.ఇక ఇటీవల చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) అయిన తరువాత బీజేపీ పూర్తిగా దూరం పాటిస్తోంది.

Advertisement

చంద్రబాబు విషయంలో ఆచితూచి స్పందిస్తోంది.కానీ పవన్ మాత్రం టీడీపీకి చంద్రబాబుకు గట్టిగా మద్దతు పలుకుతూ వచ్చారు.

అంతే కాకుండా ఒక్కసారిగా పొత్తు కూడా కన్ఫర్మ్ చేశారు.దీంతో పవన్ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

కానీ కమలనాథులు మాత్రం జనసేనతో తమ పొత్తు ప్రస్తుతం కొనసాగుతూనే ఉందని, ఇక టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవడంపై అధినాయకత్వం చూసుకుంటుంటుందని రాష్ట్ర బీజేపీ నేతలు దాటివేస్తున్నారు.ఒకవేళ టీడీపీ జనసేన కూటమితో కలవడానికి బీజేపీ మొరాయిస్తే సింగిల్ గా బరిలోకి దిగుతుందా లేదా వైసీపీతో పొత్తు కోసం పాకులాడుతుందా అనేది చూడాలి.కాగా తాము వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో బీజేపీ సింగిల్ గానే బరిలోకి దిగాల్సి వస్తే పార్టీకి డిపాజిట్లు కూడా దక్కుతయా లేదా అనే భయం కమలనాథులను వెంటాడుతోంది.మొత్తానికి చంద్రబాబు అరెస్ట్ కావడం, పవన్ టీడీపీతో పొత్తు పొట్టుకోవడం వంటి పరిణామాలతో బీజేపీ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయిందనే చెప్పాలి.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు