క్లారిటీ చెప్పకుండానే పవన్ ను అలా వాడేసుకుంటున్న బీజేపీ ! 

ఏపీలో బిజెపి, జనసేన( BJP, Jana Sena ) పార్టీల మధ్య పొత్తు ఉన్నా.ఆ పొత్తు పై అనేక అనేక సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.

అంతేకాదు జనసేన,  బీజేపీ నాయకుల మధ్య కూడా అసలు పొత్తు ఉందా లేదా అని అనుమానాలు ఉన్నాయి.దీనికి కారణం ఏపీలో రెండు పార్టీలు విడివిడిగా కార్యక్రమాలు చేపట్టడమే.

ఏ ఒక్క విషయంలోనూ ఉమ్మడిగా పోరాటాలు చేయడం కానీ , బహిరంగ సభలు కానీ నిర్వహించడం చేయలేదు.

ఏపీ బీజేపీ నాయకులు పవన్( pawan kalyan ) ను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తుండగా,  అంతే స్థాయిలో పవన్ కూడా బిజెపితో దూరం పాటిస్తున్నారు.అయితే కేంద్ర బీజేపీ పెద్దలపై మాత్రం సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు  వారంటే తనకు గౌరవం ఉంటుంది అంటూ ప్రకటనలు చేస్తుంటారు.ఇదే అవకాశంగా తీసుకుని కేంద్ర బిజెపి పెద్దలు పవన్ ను ఒక ఆట ఆడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

Advertisement

పవన్ రెండు రోజుల ఢిల్లీ ( Delhi )పర్యటనలో ఇదే తేలింది.  పవన్ పర్యటనలో భాగంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP Nadda )తో అరగంట సేపు అనేక అంశాలపై చర్చించారు.

పవన్ తో పాటు,  ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.అయితే ఈ చర్చల్లో ఏపీ రాజకీయ అంశాలు కంటే,  ఇతర విషయాలపైనే ఎక్కువగా జేపీ నడ్డా చర్చించారట.

ముఖ్యంగా కర్ణాటకలో ఎన్నికలు జరగబోతుండడంతో , అక్కడ ఎన్నికల ప్రచారానికి పవన్ వెళ్లే విధంగా ఒప్పించే ప్రయత్నాలు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది .పవన్ ఢిల్లీ పర్యటనలో ఏపీ బిజెపి వ్యవహారాల ఇన్చార్జి తో రెండుసార్లు సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కూడదు అనే మాటకు కట్టుబడి ఉన్నామని పవన్ క్లారిటీ ఇచ్చారు.

అయితే అలా జరగాలంటే టిడిపి,  బిజెపి ,జనసేన కూటమిగా ఏర్పడితేనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కుండా ఉంటుంది.కానీ టిడిపిని కలుపుకు వెళ్లకుండా బిజెపి, జనసేన లక్ష్యం వైసీపీని ఓడించడమేనని పవన్ చెబుతున్నారు.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ఆ విధంగా పవన్ చెప్పేలా బిజెపి పెద్దలు ఒత్తిడి చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఇప్పటికే బీజేపీ కేంద్ర పెద్దలు ఏపీలో వైసీపీ ప్రభుత్వం కు అనేక రకాలుగా మద్దతు ఇస్తున్నారని,  టిడిపిని అధికారంలోకి రాకుండా చేసేందుకే పవన్ ను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి.దీనికి తగ్గట్లుగానే ఇప్పుడు బిజెపి కేంద్ర పెద్దలు టిడిపితో కలిసి వెళ్లకుండా,  పవన్ ను ఒప్పించే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తున్నారు.

Advertisement

ఏపీలో పెద్దగా ఓటు బ్యాంకు లేని బిజెపికి వైసిపి అధికారంలోకి వచ్చినా పెద్దగా నష్టమేమీ ఉండదు.కానీ జనసేనకు మాత్రం రాజకీయంగా ఈ తరహా వ్యవహారాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి అనడంలో సందేహం లేదు.

తాజా వార్తలు