తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది..: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.ఇతర పార్టీల హామీలనూ ప్రజలు నమ్మడం లేదని చెప్పారు.

ప్రధాని మోదీపై ప్రజలకు విశ్వాసముందని తెలిపారు.తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిందేమీ లేదన్న ఆయన కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు.ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వం వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని మరోసారి వెల్లడించారు.

Advertisement
వైరల్ వీడియో : అమరావతి శంకుస్థాపన వేదికకు మోకాళ్లపై కూర్చొని నమస్కరించిన సీఎం..

తాజా వార్తలు