ఏపీలో బీజేపీ ఇక ఒంటరే ! పొత్తు రద్దు దిశగా జనసేన?

ఏపీలో ఒకవైపు బిజెపితో పొత్తు కొనసాగిస్తూనే టీడీపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది.

అధికారికంగా బిజెపితో పొత్తు ఉన్నా, ఏ విషయంలోనూ జనసేన ,బిజెపి( Janasena, BJP )లు ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకుని ముందుకు వెళ్లకపోవడం, అసలు రెండు పార్టీల మధ్య పొత్తు ఉందా లేదా అన్నట్లుగా వ్యవహారం ఉండడం , ఏపీ బీజేపీ నేతలు ఎవరు జనసేనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటివన్నీ చాలా కాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆగ్రహం కలిగిస్తూనే ఉన్నాయి.

అయితే ఒకవైపు బిజెపితో పొత్తు కొనసాగుతున్నా,  ఆ పార్టీని సంప్రదించకుండానే టిడిపి తో పొత్తు పెట్టుకున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు ముగియడం తో ఏపీ ఎన్నికలపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ బిజెపి విషయంలో ఒక క్లారిటీకి రావాలని నిర్ణయించుకున్నారు.

 తెలంగాణలో బిజెపి ( Telangana bjp )అధికారంలోకి వచ్చే ఛాన్స్ కనిపించకపోవడంతో,  బిజెపి పెద్దలు కచ్చితంగా మార్పు వస్తుందని ఏపీలో టీడీపీ జనసేన కూటమిలో వారు చేరుతారని అంచనా వేస్తున్నారు.అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూసి బిజెపి పెద్దలతో సంప్రదింపులు చేసి,  ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.బిజెపి కనుక టిడిపిని కలుపుకు వెళ్లేందుకు ఇష్టపడకపోతే , బిజెపితో తెగ తెంపులు చేసుకోవాలని పవన్ నిర్ణయానికి వచ్చారట .దీంతో ఏపీలో బిజెపి ఖచ్చితం గా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం ఏపీలో బిజెపి పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.

ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకునే పరిస్థితి లేదు.

Advertisement

ఇక గత కొంతకాలంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు .జనసేన తోనే కలిసి ఎన్నికలకు వెళ్తామని, తమ మధ్య ఇప్పటికి పొత్తు కొనసాగుతుందని పదేపదే పురంధరేశ్వరి ప్రకటనలు చేస్తున్నారు.అయితే టిడిపిని కలుపుకు వెళ్లేందుకు బిజెపి అగ్ర నేతలు ఎవరు అంతగా ఇష్టపడడం లేదు.

కానీ పురందరేశ్వరి మాత్రం టిడిపిని కూడా కలుపుకు వెళ్తేనే బిజెపి కి తిరుగుఉండదని అంచనా వేస్తున్నారు.బిజెపితో పొత్తు కొనసాగించే విషయంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) క్లారిటీగా ప్రకటన చేయనున్న నేపథ్యంలో పవన్ నిర్ణయం పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు