' సీమ ' పై బీజేపీ ఫోకస్ ! కర్నూలుకు అమిత్ షా 

ఏపీలో బలపడేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర అధికార పార్టీ బిజెపి 2024 ఎన్నికల్లో చాటుకోవాలనే లక్ష్యంతో ఉంది.

బిజెపి, జనసేన ల మధ్య పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆశించిన స్థాయిలోనే సీట్లను సాధించగలమనే నమ్మకం ఆ పార్టీలో కనిపిస్తోంది.

దీంతో తమకు కాస్త ఆదరణ ఉన్న ప్రాంతాలలో మరింత పట్టు సాధించాలనే వ్యూహానికి బిజెపి తెర తీసింది.దీనిలో భాగంగానే రాయలసీమ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

ఇక్కడ పార్టీకి మరింత ఊపు తీసుకొచ్చే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల ఎనిమిదో తేదీన కర్నూలుకు రానున్నారు.అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.

ఈ బహిరంగ సభలో అమిత్ షా ఏ అంశాలపై మాట్లాడుతారనేది క్లారిటీ లేనప్పటికీ, ఈ సభను విజయవంతం చేసేందుకు బిజెపి భారీగా ఏర్పాట్లు చేస్తుంది.ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ బహిరంగ సభ ఏర్పాట్లను పరిరక్షిస్తున్నారు.

Advertisement

కర్నూలులోని డీఎస్ఏ స్టేడియంలో ఈ బహిరంగ సభను నిర్వహించేందుకు బిజెపి ప్లాన్ చేస్తుంది.అమిత్ షా టూర్ పూర్తిగా పార్టీ కార్యక్రమమేనని,  అధికారిక కార్యక్రమం కాదని తెలుస్తోంది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అమిత్ షా కర్నూలు సభను విజయవంతం చేయాలనే పట్టుదలతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉన్నారు.కర్నూల్ సభ తర్వాత ఏపీ వ్యాప్తంగా బిజెపి అగ్ర నాయకులతో బహిరంగ సభలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఉత్తరాంధ్రతో పాటు , ఉభయగోదావరి జిల్లాల్లోనూ బిజెపికి ఆదరణ ఉంటుందని, ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.దీంతో ఆయా ప్రాంతాల్లోనూ బిజెపి అగ్రనేతల పర్యటనలు, సభలు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.2024 నాటికి బలమైన శక్తిగా బిజెపి ని తీర్చిదిద్దాలనే పట్టుదల ఆ పార్టీ అధిష్టానంలో కనిపిస్తోంది.2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా పోటీకి దిగబోతుండడంతో, బీజేపీ మరింతగా ఏపీ పై ఫోకస్ పెట్టినట్టుగానే కనిపిస్తోంది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు