బి‌ఆర్‌ఎస్ పై బీజేపీ రివర్స్ అటాక్ !

తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.తెలంగాణ ఏర్పడి పదేళ్ళు కావడంతో ఈ దశాబ్ది ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కే‌సి‌ఆర్ సర్కార్ నిర్వహిస్తోంది.

ఈ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ సాధించేందుకు కే‌సి‌ఆర్ చేసిన కృషి, పట్టుదల, దీక్షాదక్షతను హైలెట్ చేస్తూ ప్రజల్లో పార్టీకి మైలేజ్ పెంచుతున్నారు బి‌ఆర్‌ఎస్ నేతలు.ఎన్నికలు మరో ఐదు నెలల్లో జరుగుతుండడంతో ఈ దశాబ్ది ఉత్సవాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరై వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి మూడో సారి కూడా అధికారం చేపట్టాలని కే‌సి‌ఆర్ భావిస్తున్నారు.

Bjp Counter Attack To Brs, Bjp , Brs , Ts Politics , Cm Kcr , Bandi Sanjay , C

ఈసారి 100 పైగా సీట్లు సాధించాలని పట్టుదగల ఉన్న ఆయన ఇప్పటి నుంచే ప్రజలందరి నొళ్ళలో బి‌ఆర్‌ఎస్ పార్టీ పేరు మాత్రమే వినిపించే విధంగా కే‌సి‌ఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.అయితే అటు బీజేపీ కూడా ఈ ఎన్నికలపై గట్టిగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే.ఈసారి ఎలాగైనా కే‌సి‌ఆర్( CM KCR ) సర్కార్ ను గద్దె దించి తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్నారు కమలనాథులు.

అందువల్ల దశాబ్ది ఉత్సవాలను బి‌ఆర్‌ఎస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో.బీజేపీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.తెలంగాణ సాధించుకోవడంలో బీజేపీ నేతలు చూపిన చొరవ వారు చేసిన పోరాటాన్ని హైలెట్ చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

Bjp Counter Attack To Brs, Bjp , Brs , Ts Politics , Cm Kcr , Bandi Sanjay , C
Advertisement
BJP Counter Attack To BRS, BJP , Brs , Ts Politics , Cm Kcr , Bandi Sanjay , C

అదే విధంగా ప్రభుత్వ అబద్ద ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు కూడా ఈ దశాబ్ది ఉత్సవాలనే ఎంచుకున్నారు కమలనాథులు.నేటి నుంచి ఈ నెల 22 వరకు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయనున్నారు.ఈ కార్యక్రమాల్లో బీజేపీ( BJP )లోని నేతలు పాల్గొనే అవకాశం ఉంది.

దశాబ్ది ఉత్సవాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం బి‌ఆర్‌ఎస్( BRS party ) చేస్తుంటే.అదే ఉత్సవాల ద్వారా ప్రజల నుంచి బి‌ఆర్‌ఎస్ ను దూరం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

దీంతో ఈ రెండు పార్టీల మద్య దశాబ్ది ఉత్సవాలు రాజకీయ రగడకు దారి తీస్తున్నాయి.అటు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే అనే నినాదంతో దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది.

దీంతో ప్రధాన పార్టీల మద్య ఈ దశాబ్ది ఉత్సవాల రాజకీయ రగడ గట్టిగానే సాగుతోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు