ముందస్తు ముంచుతుందా ? తేల్చుతుందా?

దేశంలో ఎన్నికల వేడి మొదలైంది.

ఎన్డీఏ కూటమి( NDA ) ఒకపక్క, ఇండియా కూటమి( INDIA ) మరోపక్క తమ తమ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటూ ఎన్నికల యుద్ధానికి శరవేగంగా సిద్ధమవుతున్నాయి.

ప్రభుత్వ వ్యతిరేకత, దేశంలో ద్రవ్యోల్బణం పెరగటం, మౌలిక వసతుల అభివృద్ధి అంతగా లేకపోవడం, నిత్యవసర ధరలు పెరగటం, పొరుగు దేశాలతో అస్థిర సంబంధాలు ,తలసరి ఆదాయం తగ్గటం వంటి అంశాలను ఎన్నికల ఎజెండాగా పెట్టుకొని బిజెపిని( BJP ) ఓడించడానికి ప్రతిపక్ష పార్టీలుఏర్పాట్లు చేసుకుంటున్నాయి.సీట్ల సర్దుబాటు చేసుకుని త్వరలోనే పూర్తిస్థాయిలో కార్యాచరణ రూపొందించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.

అయితే ప్రతిపక్ష కూటమి పూర్తిస్థాయిలో సర్దుకుంటే తమకు ఇబ్బంది ఎదురవుతుందన్న ఆలోచనో లేక మరేదైనా ముందస్తు వ్యూహమో తెలియదు కానీ బిజెపి కొన్ని కీలక నిర్ణయాలతో రాజకీయాల్లో సంచలనం దిశగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.ఏదో ఒక బలమైన నిర్ణయాన్ని బిజెపి తీసుకుందున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి.2024 మే వరకు తమ ప్రభుత్వానికి మను గడ ఉన్నప్పటికీ పార్లమెంటును రద్దుచేసి ముందస్తుకు బిజెపి వెళ్ళబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి .ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం , దేశవ్యాప్తంగా కీలక శాఖల కార్యదర్శులను అందుబాటులో ఉండాలని కోరటం జమిలీ ఎన్నికలు( Jamili Elections ) పెట్టబోతున్నామంటూ లీక్కులు ఇవ్వడం, ఇలా వరుసపరిణామాలతో భాజపా వేడి పుట్టిస్తుంది.

చాలా కాలంగా జమిలీ ఎన్నికలపై మాట్లాడుతున్నప్పటికీ దాదాపు డజనుకు పైగానే రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) వచ్చే ఆరు నెలల్లో ఉండడంతో ఇదే అదునుగా బావించి తమ ప్రభుత్వాన్ని కూడా ముందస్తుగా రద్దుచేసి ఎన్నికలకు వెళితే ప్రయోజనం ఉంటుందని, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫలితాలు తమకు వ్యతిరేకంగా ఉంటే అది పార్లమెంట్ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే కమలనాధులు ఈ కొత్త ఎత్తుగడకు పాల్పడుతున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి బిజెపి తదుపరి చర్య పై ప్రస్తుతానికి స్పష్టత రానప్పటికీ భాజపా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మాత్రం కచ్చితం రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.మరో రెండు మూడు రోజుల్లో ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది .

Advertisement
ఆ సంపాదనను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న రామ్ చరణ్.. గ్రేట్ హీరో అంటూ?

తాజా వార్తలు