పెళ్లి గురించి అటువంటి కామెంట్స్ చేసిన బిందు మాధవి.. వైరల్ వీడియో?

సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరో హీరోయిన్లు పెళ్లిల విషయంలో తొందరపడకుండా బాగా ఆలోచనలు చేస్తూ ఉంటారు.

ఇప్పుడు జరుగుతున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆలస్యమైన సరే ఆలోచించే అడుగు వేయాలి అని ఆలోచిస్తున్నారు.

ఎందుకంటే చాలామంది హీరో హీరోయిన్లు తొందరపడి పెళ్లిలు చేసుకొని విడాకుల వరకు దారి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.అందుకే పెళ్లి చేసుకోబోయే సెలబ్రిటీలు ఇటువంటివి ఎదురుకాకుండా ఉండటానికి ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.

అందులో ఒకరు బిందు మాధవి ( Bindu Madhavi )అని చెప్పాలి.టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood Industry ) ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది బిందు మాధవి.

చేసిన సినిమాలు కొన్ని అయినప్పటికీ కూడా నటిగా కొంతవరకు సక్సెస్ సొంతం చేసుకుంది.ఆ తర్వాత కొత్త హీరోయిన్ల రాకతో ఈ అమ్మడుకు అవకాశాలు రాలేకపోయేసరికి కోలీవుడ్ వెళ్లి సెటిల్ అయింది.

Advertisement

అక్కడ వరుస సినిమాలు చేస్తూ బాగానే సెటిల్ అయింది.

ఆ తర్వాత కొంతకాలానికి ఆ మధ్యనే టాలీవుడ్ ఇండస్ట్రీకి బిగ్ బాస్ షో( Bigg Boss Show ) తో రీ ఎంట్రీ ఇచ్చింది.గతంలో హాట్ స్టార్ లో ప్రసారమైన నాన్ స్టాప్ బిగ్ బాస్ లో పాల్గొని బాగా సందడి చేసింది.మొదటి నుండి చివరి వరకు ఎటువంటి విమర్శలు ఎదుర్కోకుండా తన ఆట, మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంది.

తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకొని టైటిల్ విన్నర్ గా నిలిచింది.ఇప్పటివరకు టాలీవుడ్ బిగ్ బాస్ లో అమ్మాయి కూడా టైటిల్ విన్నర్ కాకపోగా.బిందు మాధవి తొలిసారిగా టైటిల్ విన్నర్ కావడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

అలా టైటిల్ విన్నర్ తర్వాత ఈమెకు తెలుగులో బాగానే అవకాశాలు వస్తాయని చాలామంది అనుకున్నారు కానీ ఈమెకు అంతగా అవకాశాలు రాలేకపోయాయి.ఈ మధ్యనే వరుస సినిమాలలో చేస్తూ బాగా బిజీగా మారింది.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

వెబ్ సిరీస్ లలో కూడా చేసి మంచి సక్సెస్ అందుకుంది.మొదటినుంచి ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అందాలు కూడా ఆరబోస్తుంది.

Advertisement

బహుశా అవకాశాల కోసమే తయారవుతుందని తెలుస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే.అప్పుడప్పుడు టాలీవుడ్ బుల్లితెరపై కూడా పాల్గొని బాగా సందడి చేస్తుంది.అయితే రీసెంట్గా తను ఓంకార్ హోస్ట్గా చేస్తున్న సిక్స్త్ సెన్స్ షోలో పాల్గొని బాగా సందడి చేసినట్లు కనిపించింది.

ఇక దానికి సంబంధించిన ప్రోమో బాగా వైరల్ అవుతుంది.అందులో ఓంకార్ పెళ్లి ( Bindu Madhavi Marriage ) గురించి ప్రశ్నించడంతో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టింది బిందు.

ఇప్పుడు తనకు ఎవరైతే లేరు అని.ఒకవేళ మంచి పర్సన్ వస్తే కచ్చితంగా చేసుకుంటాను అని.అలా అని తొందరపడి పెళ్లి చేసుకొని ఇబ్బంది పడను అని తెలిపింది.ఎందుకంటే ఈ కాలంలో 30 ఏళ్ళు వచ్చేలోపు అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అవ్వాలి అని.అలా ఫోర్స్బుల్ గా పెళ్లి చేసుకుంటే విడాకుల దారికి వెళ్తున్నాయి అని.కాబట్టి తను ఫోర్స్ తో కాకుండా మంచి పర్సన్ వస్తే పెళ్లి చేసుకుంటాను అని తెలిసింది.ఇక ఆమె పెళ్లి గురించి మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

తాజా వార్తలు