ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

ఈరోజుల్లో చాలామంది డ్రైవింగ్ రాకపోయినా వాహనాలు కొనుగోలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు.

లైసెన్సు, డ్రైవింగ్ సెన్స్ లేకుండా తమ ప్రాణాలను మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా రిస్కులో పడేస్తున్నారు.

ఇలాంటి బాధ్యతారాహిత్యమైన కారు డ్రైవర్లు, బైక్ రైడర్స్ చేసే యాక్సిడెంట్ల వీడియోలు( Accident Videos ) తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి.వాటిని చూస్తే చాలా ఆందోళన కలుగుతుంది.

అయితే ఇటీవల మాత్రం ఒక ఫన్నీ యాక్సిడెంట్ వీడియో వైరల్ గా మారింది.నెటిజన్లు ఆ వీడియో చూసి నవ్వుకుంటున్నారు.

నిజానికి ఇది ఒక పెద్ద యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు.చాలా సీరియస్ గా పరిగణించవచ్చు.

Advertisement

అయితే ఈ యాక్సిడెంట్ కి గురైన బైకర్‌కి( Biker ) ఏం కాలేదు.

అతడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక బిజీ రోడ్డుపై వాహనాలు వేగంగా వెళుతున్నట్లుగా కనిపిస్తుంది.అంతలోనే కుడి వైపు నుంచి ఒక బైకర్ చాలా వేగంగా వస్తూ కనిపిస్తాడు.

అయితే అతను తాగి ఉన్నాడా లేదంటే ఆ వేగంలో బండిని కంట్రోల్ చేయలేకపోయాడో తెలియదు కానీ మధ్యలో ఉన్న ఒక డివైడర్( Divider ) లాంటి ప్రాంతాన్ని ఢీకొట్టాడు.దాంతో ఒక్కసారిగా ఎగిరి ఆపోజిట్ సైడ్ లో వస్తున్న ఫోర్ వీలర్ ముందు భాగంలో పడ్డాడు.

టూవీలర్ నుంచి ఎగిరి అతను అలా పడిపోవడంతో చచ్చిపోయే ఉంటాడని అందరూ అనుకున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్1, ఆదివారం 2024
అయ్యబాబోయ్.. మీరు ఎప్పుడైనా ఇలాంటి గుడ్లను చూసారా?

నిజానికి ఇంత స్పీడ్ తో కిందపడిన వారు ఎవరైనా సరే తల పగిలి చనిపోతారు కానీ ఈ భూమ్మీద ఇంకా ఎక్కువ రోజులు బతకాలని అతనికి రాసిపెట్టినట్లుంది.అందుకే ఇంత పెద్ద ప్రమాదం నుంచి అతడు బయటపడ్డాడు.కాలుకు చిన్న గాయం అయింది.

Advertisement

కొద్దిగా కుంటుతూ తర్వాత చాలా క్యాజువల్ గా అతను తన బండి దగ్గరికి వెళ్ళాడు.సాధారణంగా అంత పెద్ద యాక్సిడెంట్ అయితే మైండ్ బ్లాక్ అవుతుంది.

ఎటు కదలలేరు కూడా.అయినా ఇతను మాత్రం ఏమీ జరగనట్లు ప్రవర్తించాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు."ఏంది భయ్యో, నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?" సరదాగా ప్రశ్నిస్తున్నారు ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు