దొంగతనం చేశాడని అనుమానం.. ఉమ్మి నాకించిన ఊరి పెద్దలు!

ఊర్లలో జరిగే పంచాయతీలు కొన్ని సార్లు విచిత్రమైన తీర్పులు ఇస్తుంటాయి.వాటికి తలా, తోక ఉండదు.

కానీ పంచాయతీ పెద్దలంతా కలిసి తాము చెప్పిందే వేదం అన్నట్లుగా ఉంటుంది ధోరణి.ఏదైనా తప్పు, నేరం జరిగినా.

వాటికి ఎలాంటి ఆధారాలు చూడరు కొన్ని సార్లు.కేవలం మాటపై ఆధారపడి తీర్పులో వాద ప్రతి వాదనలు జరుగుతుంటాయి.

చివరికి వారికి ఏదీ న్యాయం అని అనిపిస్తే, లేగా ఇంకేదైనా ఒత్తిడి వల్లో మరో వ్యక్తికి వ్యతిరేకంగా తీర్పు చెబుతారు.బిహార్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది.

Advertisement

పంచాయతీ ఇచ్చిన తీర్పు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అది బిహార్ బెగూసరాయ్ పరిధిలోని మోహన్ పుర్ గ్రామం.

ఆ ఊర్లో 12 వేల రూపాయలు దొంగతనం జరిగింది.ఓ యువకుడిపై గ్రామస్థులంతా అనుమానం వ్యక్తం చేశారు.

ఆధారాలు సంగతి మర్చిపోవాల్సిందే.పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు.

ఆ తీర్పే ఇప్పుడు అందరి విమర్శలను ఎదుర్కొంటుంది.ఆ తీర్పు ప్రకారం, దొంగతనానికి పాల్పడ్డాడన్న అనుమానం ఎదుర్కొంటున్న ఆ యువకుడు కింద ఉమ్మి వేసి తర్వాత దానిని నాకాలి.

పెసలతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. మరి వారానికి ఒక్కసారైనా వాటిని తింటున్నారా?

తర్వాత గుంజీలు తీయాలి.పంచాయతీ పెద్దలంతా తీర్పు చెప్పడంతో.

Advertisement

ఆ యువకుడు వేరే దారి లేక అదే పని చేశాడు.ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఆ తర్వాత కూడా అతడిని పోలీసులకు అప్పగించకుండా.వదిలేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తాజా వార్తలు