కేసీఆర్ సభకు గైర్హాజరుపై స్పందించిన బీహార్ సీఎం

తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత నిర్వహించిన పార్టీ తొలి ఆవిర్భావ సభకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ గైర్హాజరు అయిన విషయం తెలిసిందే.

దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్న తరుణంలో నితీశ్ కుమార్ స్పందించారు.

కేసీఆర్ నిర్వహించిన సభ గురించి తనకు తెలియదని చెప్పారు.తాను వేరే పనుల్లో బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు.

కేసీఆర్ ఆహ్వానం అందిన వారే అక్కడికి వెళ్లి ఉండారని తెలిపారు.తనకు ఒకే కల ఉందన్న నితీశ్ కుమార్ ప్రతిపక్ష నాయకులు ఏకమై సాగాలన్నారు.

అది దేశానికి మేలు చేస్తుందని వ్యాఖ్యనించారు.కాగా బీఆర్ఎస్ బహిరంగ సమావేశానికి ప్రముఖ ప్రతిపక్ష నేతలు హాజరై ప్రసంగించిన తర్వాత రోజు బీహార్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు