బిందు మాధవికి బిగ్ ఛాన్స్..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ విన్నర్ అయిన బిందు మాధవికి మరో లక్కీ ఛాన్స్ దక్కిందని తెలుస్తుంది.

బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ తెలుగులో మొదటి నుండి తన ఆటతీరుతో ఆకట్టుకున్న బిందు మాధవి బిగ్ బాస్ లోకి వచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని కోరింది.

అనుకున్నట్టుగానే ఆమె తన సత్తా చాటింది.ఇక ఇదిలాఉంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ విన్నర్ అయిన బిందు మాధవికి బాలకృష్ణ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది.

అనీల్ రావిపుడి డైరక్షన్ లో బాలయ్య తో చేసే నెక్స్ట్ సినిమాలో బిందు మాధవికి ఓ మంచి రోల్ ఆఫర్ చేశారని తెలుస్తుంది.టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ గానే కాదు బిగ్ బాస్ రెగ్యులర్ ఫాలోవర్ గా అనీల్ రావిపుడికి మంచి క్రేజ్ ఉంది.

అందుకే బిగ్ బాస్ లోకి వెళ్లే కంటెస్టంట్స్ టాలెంట్ ని బట్టి ఆయన ఛాన్సులు ఇస్తుంటాడు.అందులో భాగగానే బిందు మాధవికి బాలకృష్ణ సినిమాలో అవకాశం ఇచ్చారని తెలుస్తుంది.

Advertisement

అదే నిజమైతే మాత్రం బిందు మాధవి పంట పండినట్టే అని చెప్పొచ్చు.బిగ్ బాస్ తెలుగు ఓటీటీ బిగ్ బాస్ నాన్ స్టాప్ రెగ్యులర్ షో అంత పాపులర్ అవకపోయినా చూసిన కొంతమందైనా సరే బిందు మాధవి ఆట తీరుకి ఆమెకి ఫ్యాన్స్ గా మారారు.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?
Advertisement

తాజా వార్తలు