బిగ్ బాస్ 6 : ఈ వారం ఎలిమినేషన్.. రిస్క్ ఎవరికి అంటే..!

బిగ్ బాస్ సీజన్ 6 లో నాల్గవ వారం 10 మంది నామినేషన్స్ లో ఉన్నారు.

హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ మధ్య ఫైనల్ గా 10 మంది 4వ వారం నామినేషన్స్ కి వచ్చారు.

అయితే ఆల్రెడీ అర్జున్, కీర్తిలను హోస్ట్ నాగార్జున డైరెక్ట్ నామినేట్ చేయగా.మిగతా వారిలో రేవంత్, శ్రీహాన్, సుదీపా, ఇనయా, ఆరోహి, సూర్య, రాజ్, గీతు ఉన్నారు.

దాదాపు ఈ నాలుగు వారాల నుంచి గీతు, రేవంత్ ప్రతివారం నామినేషన్స్ లో ఉన్నారని చెప్పొచ్చు.రేవంత్ తన మాట తీరు వల్ల నామినేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.

ఇక ఇదిలాఉంటే ఈ వారం నామినేట్ అయిన 10 మంది నామినేషన్స్ లో ఎవరికి రిస్క్ ఉంది అన్నది చూస్తే.అసలైతే ఇనయాకి మొదటి నుంచి నెగిటివిటీ ఉన్నా సరే శ్రీహాన్ తరచు ఆమెని టార్గెట్ చేయడం వల్ల ఆడియన్స్ లో ఆమెకు సింపతి పెరిగింది.

Advertisement

అంతేకాదు నిన్న నామినేషన్స్ లో అందరు కూడా ఇనయాని టార్గెట్ చేయడం వల్ల కూడా ఆమెకి ఆడియన్స్ నుంచి సపోర్ట్ వచ్చింది.సో ఇలా చూస్తే ఈ వారమే కాదు ఇనయాకి స్ట్రాంగ్ ఓటింగ్ ఉంటుందని చెప్పొచ్చు.

ఇక ఈ వారం సుదీపా, ఆరోహి, రాజ్ లలో ఒకరికి రిస్క్ ఉందని చెప్పొచ్చు.అర్జున్ కి కూడా పెద్దగా సూపర్ ఓటింగ్ లేదు అర్జున్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.

మరి వీరిలో ఎవరు ఈ వారం హౌస్ కి గుడ్ బై చెబుతారో చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022
Advertisement

తాజా వార్తలు