అమర్ మరియు ప్రశాంత్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపనున్న బిగ్ బాస్..?

తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు రెడ్ కార్డు( Red Card ) ఇవ్వడం, హౌస్ మేట్ ని బయటకి పంపడం వంటివి జరగలేదు.

గత సీజన్ లో రేవంత్ చాలా వైల్డ్ గా ఆడుతూ అందరినీ గాయ పరుస్తూ ఉండేలోపు నాగార్జున ఒక వార్నింగ్ కాల్ లాగా ఎల్లో కార్డు ని ఇస్తాడు.

ఇంకోసారి ఫిజికల్ అయితే బయటకి పంపిస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చాడు.అప్పటి నుండి రేవంత్( Revanth ) చాలా జాగ్రత్తగా ఆడడం ప్రారంభిస్తాడు.

కానీ ఈ సీజన్ లో ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో అమర్( Amardeep ) మరియు ప్రశాంత్( Pallavi Prashanth ) మధ్య గొడవ తారా స్థాయికి చేరినట్టు సోషల్ మీడియా లో ఈరోజు ఉదయం నుండి ఒక వార్త తెగ ప్రచారం సాగుతుంది.సీజన్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఎదో ఒక విషయం లో గొడవ జరుగుతూనే ఉంది.

రెండవ వారం లోనే నామినేషన్స్ సమయం వీళ్లిద్దరి గొడవ ఎంత పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యిందో మనమంతా చూసాము.

Bigg Boss To Issue Red Card For Pallavi Prashanth And Amardeep Details, Bigg Bos
Advertisement
Bigg Boss To Issue Red Card For Pallavi Prashanth And Amardeep Details, Bigg Bos

ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య ఎప్పుడు నామినేషన్( Nomination ) జరిగినా హౌస్ మొత్తం యుద్ధ వాతావరణం ని తలపిస్తాది.ఈ వారం కూడా వీళ్లిద్దరి మధ్య నామినేషన్స్ సమయం లో ఏ రేంజ్ లో గొడవ జరిగిందో మనమంతా చూసాము.అయితే ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో టాస్కు ఆడుతున్న సమయం లో ఇద్దరి మధ్య గొడవ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో జరిగిందట.

ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఎన్నడూ జరగని విధంగా ఇద్దరు ఫిజికల్ గా కొట్టుకున్నారని సమాచారం.ప్రశాంత్ అమర్ మెడ ని పట్టుకోగా, అమర్ ప్రశాంత్ ని చాలా గట్టిగా కొరికాడట.

వీళ్లిద్దరి మధ్య జరిగిన కొట్లాట లో ఇద్దరికీ గాయాలు కూడా బాగా అయ్యినట్టు సమాచారం.హిందీ బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఇద్దరి కంటెస్టెంట్స్ మధ్య ఫిజికల్ గా గొడవలు జరిగితే రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపేస్తారు.

Bigg Boss To Issue Red Card For Pallavi Prashanth And Amardeep Details, Bigg Bos

గతం లో కొంతమంది కంటెస్టెంట్స్ కి మధ్య ఇలా జరగడం తో వెంటనే వారికి రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపిన సందర్భాలు ఉన్నాయి.కానీ తెలుగు బిగ్ బాస్ లో( Bigg Boss Telugu ) ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి అయితే రాలేదు.కానీ ఈరోజు ఎపిసోడ్ లో అలాంటి సందర్భం రావడంతో వీకెండ్ లో నాగార్జున( Nagarjuna ) రెడ్ కార్డు ఇచ్చి ప్రశాంత్ మరియు అమర్ ని బయటకి పంపే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

టాప్ 2 కంటెస్టెంట్స్ గా టైటిల్ రేస్ లో ఉన్న ఈ ఇద్దరు ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ రేటింగ్స్ అమాంతం పడిపోతుందని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Advertisement

తాజా వార్తలు