తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది.హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, టాస్కులు, అలకలు, బుజ్జగింపులతో మరింత రసవత్తరంగా సాగుతోంది.
కాగా ఇప్పటికే మూడు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నాలుగో వారం కూడా ముగింపు దశకు చేరుకుంది.సరికొత్త టాస్కులతో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెంట్ ఇబ్బంది పెడుతూనే ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.
ఇకపోతే మొదటి వారం బాలాదిత్య, రెండవ వారం రాజ్, మూడవ వారం ఆది రెడ్డి కెప్టెన్ లుగా మారారు.ఇక నాలుగో వారం కీర్తి భట్ కెప్టెన్ గా ఎంపిక అయింది.
అంతే కాకుండా బిగ్ బాస్ 6 సీజన్ లో తొలి మహిళా కెప్టెన్ గా నిలిచిన కీర్తి సింహాసనం పై కూర్చుంది.ఇక మరొకవైపు కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోయిన సత్య దగ్గర కూర్చొని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అర్జున్ అక్కడికి వెళ్లి ఆమె కాలు నొక్కుతూ కనిపించాడు.
ఆ తర్వాత బిగ్బాస్ ఈవారం ఎవరో వరస్ట్ కంటెంట్ అన్నది తెలుసుకోమని చెప్పగా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నామినేట్ చేస్తూ వచ్చారు.అయితే అందరికంటే వరస్ట్ కంటెస్టెంట్ గా అర్జున్ కు ఎక్కువ ఓట్లు పడ్డాయి.
దీంతో అర్జున్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.అయితే అర్జున్ జైలుకు వెళ్లడానికి కారణం నేనే అని శ్రీ సత్య తెలిపింది.నా వల్లే అర్జున్ కు ఓట్లు ఎక్కువగా పడ్డాయి.
ఇక అర్జున్ నాకు సపోర్ట్ చేయదు అని చెప్పుకొచ్చింది శ్రీ సత్య.ఇది ఇలా ఉంటే మరొకవైపు సోషల్ మీడియాలో నాలుగో వారం హౌస్ లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.
అలాగే ప్రతి వారం హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ప్రేక్షకులు ముందుగానే అంచనా వేస్తూ ఉంటారు.కానీ ఈ వారం మాత్రం ఇప్పటివరకు ఎవరి పేర్లు వినిపించడం లేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy