Bigg Boss 7: ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.. ఈ ఆరుగురు ఎంట్రీ ఖాయం?

తెలుగులో బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) త్వరలోనే ప్రారంభం కానుంది.

ఇప్పటికే ఆరు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఏడవ సీజన్ కు రెడీ అవుతోంది.

ఇప్పటికే రెండు ప్రోమోలను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ సీజన్ కి కూడా నాగార్జున( Nagarjuna ) హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

ఇకపోతే ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్ లు వీళ్లే అంటూ చాలామంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి.ఇందులో కంటెస్టెంట్ల పేర్లు ఇప్పటికే ఖరారు అయినట్లు కూడా తెలుస్తోంది.

మరీ ముఖ్యంగా ఆరుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం ఖాయం అని తెలుస్తోంది.మరి ఆ ఆరుగురు కంటిస్టెంట్లు ఎవరు అన్న విషయానికి వస్తే.

Advertisement

బులితెర నటి శోభా శెట్టి.( Shoba Shetty ) చాలామంది శోభా శెట్టి అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ కార్తీకదీపం సీరియల్ డాక్టర్ మోనిత అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని తెలుస్తోంది.

యాంకర్ విష్ణు ప్రియ( Vishnu Priya ) కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది.

గత సీజన్లోనే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలు వినిపించినప్పటికీ అప్పుడు ఆమె ఎంట్రీ ఇవ్వలేదు.కానీ ఈసారి ఎంట్రీ ఇవ్వడం మాత్రం పక్కా అని తెలుస్తోంది.

వైష్ణవి చైతన్య.( Vaishnavi Chaitanya ) తాజాగా విడుదలైన బేబీ సినిమాతో హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

అలాగే మరో బుల్లితెర నటి నవ్య స్వామి( Navya Swamy ) కూడా బిగ్బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని తెలుస్తోంది.ఆమె, నా పేరు మీనాక్షి, లాంటి సీరియల్స్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది నవ్య స్వామి.వెండితెర నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి( Surekha Vani ) కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని తెలుస్తోంది.

Advertisement

సింగర్ మోహన భోగరాజు.( Singer Mohana Bhogaraju ) బుల్లెట్ బండి పాటుతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఈమె అప్పటితో పాటు ఇంకా ఎన్నో పాటలను ఆలపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈమె కూడా ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అలాగే బుల్లితెర నటుడు, బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ లేదంటే అతని కొడుకు చంద్రహాస్ ఇద్దరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిన దీపిక పిల్లి కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోందట.టిక్ టాక్ దుర్గారావు కూడా ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు