టాప్ 3 కంటెస్టెంట్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆదిరెడ్డి.. ఏమన్నాడో తెలుసా?

తాజాగా బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ స్పెషల్ గెస్ట్ లతో అదిరిపోయింది.

ఒకరి తర్వాత ఒకరు సెలబ్రిటీలు రావడంతో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మొత్తం సంతోషంగా హ్యాపీ హ్యాపీగా సాగింది.

గ్రాండ్ ఫినాలే కి ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీలను ఒక్కొక్కరిని పిలిచి వారితో ఒక్కొక్కరిని ఎలిమినేషన్ చేయిస్తూ వచ్చాడు హోస్ట్ నాగార్జున. ఈ క్రమంలోనే మొదట నిఖిల్ ని హౌస్ లోకి పంపించి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకరైన రోహిత్ ను ఎలిమినేట్ చేసి తనతో పాటు బయటకు తీసుకొని వచ్చాడు.

ఆ తర్వాత ధమాకా హీరో హీరోయిన్ లు రవితేజ, శ్రీ లీల జింతాత సాంగ్ తో ఎంట్రీ ఇవ్వడంతోనే డాన్స్ ను అదరగొట్టారు.ఆ తర్వాత వాళ్లు ఆదిరెడ్డిని ఎలిమినేట్ చేశారు.

ఇక ఎలిమినేట్ అయిన సందర్భంగా ఆది రెడ్డి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పదిమంది నా మీద మాట్లాడిన కూడా నేను ఎదురుగా నిలబడగలను ధైర్యం నాకు బిగ్ బాస్ షోతో వచ్చింది అని తెలిపాడు ఆదిరెడ్డి.

Advertisement
Bigg Boss Telugu 6 Grand Finale Adi Reddy Emotional Comments Top 3 Contestants D

టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో నాలుగో కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన ఆది రెడ్డి మాట్లాడుతూ.కీర్తి బిగ్ బాస్ షో లో కనిపించడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది ఆత్మహత్యలు ఆగిపోతాయి.

Bigg Boss Telugu 6 Grand Finale Adi Reddy Emotional Comments Top 3 Contestants D

ఎందుకంటే కీర్తి అన్ని కష్టాల్లో ఉన్నా కూడా అంత ధైర్యంగా ముందుకెళ్లడం అన్నది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అంటూ కీర్తి పై పొగడ్తల వర్షం కురిపించాడు ఆదిరెడ్డి.అనంతరం రేవంత్ గురించి మాట్లాడుతూ రేవంత్లో 20 తప్పులు ఉంటే అందులో 40 పాజిటివ్ లు ఉంటాయి.భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను వదిలి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి గేమ్ ఆడటం అంటే మామూలు విషయం కాదు.

నాకంటే ఆ ముగ్గురు కూడా బాగా ఆడారు.కాబట్టి వాళ్ల కంటే ముందుగా ఎలిమినేట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపాడు అది రెడ్డి.

.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు