బిగ్‌బాస్ కంటే ఎర్రగడ్డ ఆసుపత్రే బెటరా.. హౌస్‌లో అన్నీ తిక్క కేసులే?

సెప్టెంబర్ 1న బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 8 ప్రారంభమైంది.ఈసారి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు.

ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయ్యాయి, నలుగురు ఎలిమినేట్ అయ్యారు.ఈ సమయంలో 12 మందిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి తీసుకొస్తామని బిగ్‌బాస్ ప్రకటించాడు.

వారిలో మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు.హరితేజ( Hariteja పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్ల క్రితం హౌస్ లో  హరికథ చెప్పి చిరాకు పుట్టించింది.

Advertisement

కానీ తన చురుకుతనం వల్ల టాప్ ఫైవ్‌కి వెళ్ళింది.కానీ సహజంగానే బిగ్‌బాస్‌కి ఆడవారంటే నచ్చదు.ఆయనొక యాంటీ ఫెమినిస్ట్ కదా అందుకే హరితేజను ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో రాకుండా జాగ్రత్త పడ్డాడు.

థర్డ్ ప్లేస్ తో ఆమెను ఇంటికి పంపించేశాడు.పాస్ట్ సీజన్‌లో కనిపించిన అవినాష్ మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని తెలుస్తోంది.

గతంలో బిగ్‌బాస్‌ హౌస్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏదో కామెడీగా జ్యోతిష్కం చెప్పాడు అవినాష్( Avinash ).కానీ అదో పిచ్చి ప్రయత్నం.అది ఎవరిని నవ్వించలేదు సరి కదా అందరికీ తలనొప్పి తెప్పించింది.

నిజానికి అవినాష్ చేసిన కామెడీ కామెడీనే కాదు కానీ తానొక గొప్ప కమెడియన్, పర్‌ఫార్మర్‌ను అని బాగా అతి చేస్తుంటాడు.నిజానికి హరికథ లేదా జ్యోతిష్యం స్పూఫ్ చేయడం చాలా కష్టం అది పండాలంటే బాగా కష్టపడాలి.

ఒక్క లీటర్ కెమికల్స్‌తో 500 లీటర్ల నకిలీ పాలు తయారీ.. వీడియో చూస్తే షాకే..
పుష్ప2 లో బన్నీ ధరించిన దుస్తుల వెనుక అసలు కథ ఇదే.. అక్కడే కొనుగోలు చేశారా?

లుక్కు ఒక్కటుంటే సరిపోదు.మంచి భాష, స్పాంటేనిటీ, హ్యూమర్ ఉంటేనే అవి రక్తికడతాయి.

Advertisement

బిగ్‌బాస్ లాంటి షోలలో ఇంత టాలెంటు ఎవరికీ ఉండడం లేదని చెప్పుకోవచ్చు.అందుకే ఆ షో అనేది లాఫింగ్ స్టాక్‌ కాలేకపోతోంది.

సెలక్షన్స్ అన్నీ చాలా బ్యాడ్ గా ఉంటున్నాయి.ఎంటర్‌టైన్‌మెంట్ కరువైందని తెలుసుకున్న బిగ్‌బాస్‌ పరోక్షంగా ఆదేశాలు ఇస్తూ కంటెస్టెంట్ల చేత పాటలు పాడిస్తూ, ఆటలు ఆడిస్తున్నాడు./br>

అందులో భాగంగానే రీసెంట్‌గా మణికంఠతో జోస్యాలు ( Manikanta )చెప్పించాడు.ఈ కంటెస్టెంట్ మెంటల్ కండిషన్ సరిగా లేదని విషయం తెలిసిందే.అయినా సరే ఆ ఎపిసోడ్‌లో బాగా నటించి కడుపుబ్బా నవ్వించాడు.

అందువల్ల అతన్ని చాలామంది ప్రశంసించారు.ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకుంటూ చిరాకు తెప్పించే మణికంఠ ఫస్ట్ టైమ్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయగలిగాడు.

సో, ఓ ఎంటర్టైనర్, కమెడియన్ దొరికాడు కాబట్టి అవినాష్, హరితేజ, రోహిణి వైల్డ్ కార్డు ఎంట్రీలు అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.ఇక యష్మి ఓ వింత కేరక్టర్.

ఆమె అరుస్తుంది, తనకు ఇష్టం వచ్చినట్లు వాగుతుంది.ఆమె ఓ తిక్క కేసు అని ప్రేక్షకులు ఆల్రెడీ ట్రోల్ చేస్తున్నారు.

బిగ్‌బాస్‌ ఆమెను కన్‌ఫెషన్ రూమ్‌కి పిలిచి రెండు బహుమతులలో ఒక బహుమతిని అందజేయాల్సిందిగా కోరారు.ఆ రెండింటిలో ఒక బహుమతి నిఖిల్‌కు ఇంటి నుంచి వచ్చింది.

మరొక గిఫ్ట్ మణికంఠకు భార్య పంపింది.అయితే యష్మి మొదట నిఖిల్‌కే బహుమతి ఇవ్వడానికి ఆసక్తి చూపింది.

వాస్తవానికి మణికంఠ వైవాహిక జీవితం బాగా దెబ్బతిన్నది.ఆమె అతడిని వదిలేసి బిడ్డతో సహా వేరుగా ఉంటోంది.

డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన మణికంఠ బిగ్‌బాస్ టైటిల్ నెగ్గితే వాళ్లు తన జీవితంలోకి వస్తారని ఆశ పడుతున్నాడు కానీ అది తన భ్రమ అని చెప్పుకోవచ్చు.అతడి భార్య ఓ కేక్, మెసేజ్ పంపించిందట.

మణికంఠ మెంటల్ సిట్యుయేషన్‌కు  నిజానికి గిఫ్ట్ ఇవ్వాలి కానీ అలా చేయలేదు మొత్తం మీద అందరూ మెంటల్ కేసులే హౌస్ లో ఉన్నారని ఎర్రగడ్డ ఆసుపత్రి బిగ్ బాస్ హౌస్ కంటే బెటర్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు