Ashu Reddy : నిజాన్ని ఒప్పేసుకున్న అషు రెడ్డి.. తను అందగత్తే కానంటూ?

మామూలుగా అమ్మాయిలు ఎవరైనా సరే తాము అందంగా లేము అని అస్సలు ఒప్పుకోరు.అలా అప్పుకుంటే వారి మనోభావాలు దెబ్బ తినేలా ఉంటాయి.

ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు( Celebrities ) తాము అందగత్తెలు అనే ఫీల్ అవుతూ ఉంటారు.వారిని ఎవరైనా అందంగా లేరు అంటే చాలు వెంటనే వారిపై కోపాన్ని చూపిస్తుంటారు.

కానీ ఇక్కడ అషు రెడ్డి తను అందగత్తె కానంటూ నిజాన్ని ఒప్పేసుకుంది.ఇంతకు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Ashu Reddy : నిజాన్ని ఒప్పేసుకున్న అ�

సోషల్ మీడియా ద్వారా స్టార్ గా మారి ఇండస్ట్రీలో బాగా దూసుకుపోతున్న అషురెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బుల్లితెర ఆర్టిస్ట్ గా అషు రెడ్డి తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.బిగ్ బాస్( Bigg Boss ) లో అవకాశం అందుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.

Advertisement
Ashu Reddy : నిజాన్ని ఒప్పేసుకున్న అ�

ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను పిచ్చెక్కించింది.అషు తొలిసారిగా డబ్స్మాష్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంది.

ఇక చూడటానికి సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడటంతో జూనియర్ సమంత అని పేరు కూడా సంపాదించుకుంది.అలా అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశం అందుకుంది.

అంతేకాకుండా బుల్లితెరలో గతంలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని ప్రేక్షకులకు పరిచయం అయింది.

Ashu Reddy : నిజాన్ని ఒప్పేసుకున్న అ�

ఈ షో తర్వాత అషు రెడ్డి( Ashu Reddy ) కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈమె పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

ఈమె గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.

Advertisement

ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్( Lady Comedian ) గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరి( Comedian Express Hari )తో బాగా రెచ్చిపోయింది.

ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది.ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.

అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్( Bigg Boss Non Stop ) లో అవకాశం అందుకుంది.ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇందులో మరో కంటెస్టెంట్ అజయ్ తో బాగా రచ్చ చేసింది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ ఫోటోలతో కన్నార్పకుండా చేస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫోటోస్ పంచుకోగా ఆ ఫోటోలు చూసి తన ఫ్యాన్స్ రకరకాలుగా తన అందాన్ని పొగుడుతున్నారు.

అలా ఒక నెటిజన్.అందం అమ్మాయ్ అయితే నీ లా ఉందా అన్నట్టు ఉంది అని కామెంట్ చేయగా వెంటనే.

పాట మార్చు ఇంకా అంటూ రిప్లై ఇచ్చింది.దీంతో మిగతా నెటిజన్స్ ఇంతకాలానికి నిజాన్ని ఒప్పేసుకున్నావ్.

నువ్వు అందగత్తే కాదని ఒప్పుకున్నావ్.గ్రేట్ అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

తాజా వార్తలు