దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అరియనా.. ఇదేం పాడు అలవాటు అంటూ ట్రోల్స్?

అరియనా ( Ariyana Glory )పరిచయం అవసరం లేని పేరు .

ఈమె యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ యాంకర్ గా మంచి సక్సెస్ అయ్యారు.

అయితే ఎప్పుడైతే రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేశారో ఆ క్షణం నుంచి విపరీతమైనటువంటి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి అరియనా ఏకంగా బిగ్ బాస్ ( Bigg Boss ) అవకాశాన్ని అందుకున్నారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు.

ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు ప్రత్యేకమైన ఈవెంట్లలో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు.అలాగే వెబ్ సిరీస్ లలో షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటిస్తూ ఉన్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఒకప్పుడు సన్నజాజితీగల ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం మాత్రం కాస్త బొద్దుగా( Overweight ) తయారు కావడంతో ఈమె పట్ల భారీ స్థాయిలో బాడీ షేమింగ్ ట్రోల్స్ వస్తుంటాయి.ఇలా తన గురించి వచ్చినటువంటి ట్రోల్స్( Trolls ) పై ఒకానొక సందర్భంలో ఘాటుగా స్పందించారు.

Advertisement

నా బాడీ నా ఇష్టం మధ్యలో మీకేంటి నష్టం అంటూ ఈమె ట్రోలర్స్ కు తన స్టైల్ లోనే కౌంటర్ ఇచ్చారు.

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అరియనా తాజాగా దొంగతనం చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియో సంచలనంగా మారింది.బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సీ( Bigg Boss Jessie ) తో కలిసి ఈమె ఈ దొంగతనం చేశారు.వీరిద్దరూ కలిసి నైట్ ఒక పార్టీకి వెళ్లారు ఆ పార్టీ జరిగిన చోటనే ఒక తోట ఉంది అయితే ఆ తోటలో పాలకూర వేయడంతో ఈమె సరదాగా ఆ తోట( Garden )లో దొంగతనానికి వెళ్లారు.

జెస్సి ఇది వీడియో తీస్తుండగా అరియనా దొంగతనం చేసింది.ఇది పాలకూరనో చుక్కకూరనో( Spinach ) తెలియడం లేదు చీకటిగా ఉంది నాకు దొంగతనం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందని తెలిపారు.

అక్కడికి జెస్సి ₹10 కి ఒక కట్ట వస్తుందని చెప్పగా డబ్బు ఇక్కడ ముఖ్యం కాదు దొంగతనం చేయడంలో త్రిల్ ఉంటుందంటూ ఈమె పాలకూర మొత్తం కట్ చేసుకుని తీసుకువచ్చారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

అయితే ఆమె తోటలో నుంచి బయటకు వస్తున్నటువంటి సమయంలోనే కొంతమంది బైక్ పై రావడంతో ఈ తోట మీదేనా అంటూ ఒక్కసారిగా భయపడిపోయారు.వారు కాదని చెప్పడంతో రిలాక్స్ అయినటువంటి ఈమె మీ తోటలో నేను దొంగతనం( Robbery ) చేస్తున్నాను నన్నేం అనుకోవద్దండి అని చెబుతూనే అక్కడి నుంచి బయటకు వచ్చారు.ఇక ఈ వీడియో పై వివిధ రకాలుగా నేటిజన్స్ కామెంట్లు( Netizens Comments ) చేస్తున్నారు.

Advertisement

ఇదేం పాడు అలవాటు అంటూ కొందరు కామెంట్లు చేయగా దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో ప్యాంటు వేసుకోవడం కూడా మర్చిపోయావు అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.