తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది.
ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా మూడవ వారం ఎలిమినేషన్ లో భాగంగా మూడవ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయింది.అయితే మూడో వారం ఎలిమినేషన్స్ విషయంలో ముందు నుంచి అందరూ అనుకున్నట్టుగానే జరిగింది.
బిగ్‌బాస్ నుంచి మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయింది.అయితే ఈ విషయం పూర్తి ఎపిసోడ్ రాక ముందు నుంచే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
అయితే మిగతా విషయాలలో ప్రేక్షకుల అభిప్రాయాలు అంచనాలు తప్పు అయినప్పటికీ ఎలిమినేషన్స్( Bigg Boss Eliminations ) విషయంలో మాత్రం అభిమానులు, బిగ్ బాస్ ప్రేక్షకులు ఊహించిందే జరుగుతోంది.తాజాగా మూడో వారం జరిగిన ఎలిమినేషన్ సంబంధించిన విషయాలకు వస్తే.కాగా ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి మొదటి రెండువారాల్లో వరసగా కిరణ్ రాథోడ్, షకీలా తక్కువ ఓట్లు పోల్ అయిన కారణంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది.ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు ఉండగా అందులో దామిని ( Singer Damini )కి తక్కువ ఓట్లు వచ్చాయి.
దీంతో ఆమె ఎలిమినేట్ అయిపోయింది.
అయితే షో ప్రారంభమైనప్పుడు ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలని తీసుకొచ్చిన బిగ్‌బాస్, ఎలిమినేషన్స్ లో మాత్రం ప్రతీ సారి లేడీస్‌ని ఎలిమినేట్ చేస్తున్నాడన్న వాదనలు ఎక్కువగా వినిపించడంతోపాటు అవే నిజమవుతున్నాయి.వచ్చే వారం కూడా ఇదే కొనసాగితే మాత్రం హౌసులో జెండర్ బ్యాలెన్స్( Gender Balance ) దెబ్బతినే అవకాశం ఉంది.అలానే గతంలో ప్రతి సీజన్‌లోనూ సింగర్స్ వచ్చారు.
వాళ్లలో రాహుల్ విజేతగా నిలవగా, గీతా మాధురి లాంటి వాళ్లు టాప్-5 వరకు వెళ్లారు.కానీ దామిని మాత్రం మూడో వారానికే హౌస్ నుంచి బయటకొచ్చేసింది.
బిగ్‌బాస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.అయితే వరుసగా మూడోసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్( Lady Contestant Elimination ) అవ్వడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
బిగ్ బాస్ కి అసలు బుద్ధుందా లేదా? ప్రతిసారి రెడీ కండిషన్ ని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నాడు? అంటూ కొందరు షో నిర్వహికులపై మండిపడుతున్నారు.ఈ విషయం పట్ల కొందరు మహిళా ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరి వచ్చేవారం బిగ్ బాస్ ఎవరిని ఎలిమినేట్ చేస్తాడో చూడాలి మరి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy