నన్ను డిస్ట్రబ్ చెయ్యకండి.. ప్రజెంట్ ఫీలింగ్ ఇదే.. అషు రెడ్డి వైరల్ స్టోరీ?

సోషల్ మీడియా ద్వారా స్టార్ గా మారి ఇండస్ట్రీలో బాగా దూసుకుపోతున్న అషూ రెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం బుల్లితెర ఆర్టిస్ట్ గా అషు రెడ్డి తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.

పైగా తెగ అవకాశాలు అందుకుంటూ బాగా బిజీగా ఉంటుంది.నిజానికి ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

పైగా ఇటీవలే పూర్తయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అవకాశం అందుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను పిచ్చెక్కించింది.

నిజానికి ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడుపుతుంది.తొలిసారిగా డబ్స్మాష్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ.

Advertisement

ఇక చూడటానికి సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడటంతో జూనియర్ సమంత అని పేరు కూడా సంపాదించుకుంది.ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశం అందుకుంది.

అంతేకాకుండా బుల్లితెరలో గతంలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఈ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈమె పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.

ఈమె గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది.

Advertisement

ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది.ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.

అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.

ఇక ఇందులో మరో కంటెస్టెంట్ అజయ్ తో బాగా రచ్చ చేసింది.నిజానికి రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది అంటే తర్వాత తన పొజిషన్ ఏంటో క్లియర్ గా అర్ధం అవుతుంది.

ఇక బిగ్ బాస్ తర్వాత మళ్లీ నెట్టింట్లో తన రచ్చ మొదలు పెట్టింది.ప్రతి రోజు ఫోటోలు షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.

అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు దారుణమైన ట్రోల్స్, కామెంట్లు పెడుతూ ఉంటారు.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.అందులో తన వైబ్స్ ఆన్ లో ఉన్నాయి అని.తన ప్రజెంట్ ఫీలింగ్ ఇదే అంటూ కాబట్టి తనను డిస్టర్బ్ చేయకండి అంటూ పెట్టింది.దీంతో నెటిజన్లు అషూ కు ఏం జరిగింది అంటూ.

ఎవరిని ఉద్దేశించి అలా పెట్టింది అంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఆమె పంచుకున్న స్టోరీ ప్రస్తుతం వైరల్ గా మారింది.

తాజా వార్తలు