Ashwini Sree: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ నా వాడే.. బిగ్ బాస్ అశ్విని షాకింగ్ కామెంట్స్ వైరల్!

అశ్విని శ్రీ.( Ashwini Sree ) గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.

ఇటీవలే తెలుగులో ముగిసిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి( Bigg Boss 7 ) వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీని సంపాదించుకుంది అశ్విని.ఇక హౌస్ లో టాస్కులతో ప్రేక్షకులను మెప్పించలేక పోయినప్పటికీ తన అందచందాలతో మాత్రం మంచి గుర్తింపును ఏర్పరచుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని శ్రీ టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్( Pawan Kalyan ) గురించి ఆసక్తికరమైన కామెంట్స్​ చేసింది.తాను గబ్బర్‌ సింగ్‌లో( Gabbar Singh ) నటించిన సమయంలో పవన్‌తో తనుకున్న పరిచియాన్ని తెలిపింది.ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ ఫ్రెండ్‌గా నటించిన అశ్విని మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

పవన్‌ ఓజీ సినిమా( OG Movie ) హిట్‌ కావాలని ఆమె కోరుకుంది.పవన్ కల్యాణ్ ఎప్పుడూ నా వాడే.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది అశ్విని.

పవన్ కల్యాణ్‌ను మళ్లీ కలిసే అవకాశం వస్తే మీ రియాక్షన్ ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా.పవన్‌తో దాదాపు 3 నెలలు జర్నీ చేశాను.షూటింగ్ సమయంలో పక్కన కూర్చొపెట్టుకుని పవన్‌ సార్‌ మాట్లాడేవారు.

సెట్స్‌లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్​ తింటున్న డ్రై ఫ్రూట్స్ కూడా తినమ్మా అంటూ నాకు ఇచ్చేవారు.అశ్విని కమాన్ అని ఎంకరేజ్‌ చేసేవారు.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023

ఆయనకి ఎప్పుడైనా బోర్ కొడితే నన్నే పిలిచేవారు.ఆపై మాతో పాటలు, డ్యాన్స్‌ చేపిస్తూ సరదాగా ఉంటారు.

Advertisement

అందుకే పవన్‌ అంటే ఇష్టం అని తెలిపింది అశ్విని.

తాజా వార్తలు