Bigg Boss7 Prince Yawar : సినిమా ఆఫర్లు లేక తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను.. మోడల్ ప్రిన్స్ యావర్?

తెలుగులో తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే.

ఇప్పటికీ ఆరు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఎట్టకేలకు సీజన్ సెవెన్ ప్రారంభం అయింది.

హోస్ట్ నాగార్జున( Nagarjuna ) షోని గ్రాండ్ గా మొదలుపెట్టారు.అయితే ముందుగా అనుకున్న విధంగానే కొందరు కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

కొంతమంది కొత్త కంటెస్టెంట్లు కూడా ఎంట్రీ ఇచ్చారు.అయితే గత ఎపిసోడ్ మాదిరిగానే ఈ ఎపిసోడ్ లో కూడా ఒక మోడల్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

అతను మరెవరో కాదు ప్రిన్స్ యావర్‌.

Bigg Boss 7 Telugu Prince Yawar Entered 4th Contestant
Advertisement
Bigg Boss 7 Telugu Prince Yawar Entered 4th Contestant-Bigg Boss7 Prince Yawar

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నా పేరు మీనాక్షి వంటి సీరియల్ లో నటించారు.ఇది ఇలా ఉంటే తాజాగా యావర్‌( Prince Yawar ) బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వడంతోనే హాట్ పెర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చాడు.ఈ సందర్భంగా ఓవర్ గా రియాక్ట్ అవుతూ బస్ హౌస్ లోకి వెళుతున్నందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అంటూ పదేపదే నాగార్జునతో తెలిపారు.

నాకు తెలుగు అంతగా రాదు ఏవైనా పొరపాటులో ఉంటే క్షమించండి అంటూ మిక్స్డ్ లాంగ్వేజ్ తో మాట్లాడారు.అనంతరం యావర్ నాగార్జునతో మాట్లాడుతూ.కరోనా సమయంలో ఛాన్సులు లేక తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను.

ఆ సమయంలో ఏదైనా ఉద్యోగం చేద్దామని ప్రయత్నాలు చేశాను.ఇందుకోసం అమీర్‌పేటలో రూ.7 లక్షలు పెట్టి ఒక కోర్సు కూడా నేర్చుకున్నాడు.

Bigg Boss 7 Telugu Prince Yawar Entered 4th Contestant

ఉద్యోగం కోసం వెతుకులాట మొదలుపెట్టిన సమయంలో బిగ్‌బాస్‌ ఆఫర్‌( Bigg Boss Offer ) వచ్చింది.ఇంత మంచి అవకాశాన్ని వదులుకునేందుకు ఎవరు మాత్రం ఇష్టపడతారు? అందుకే క్షణం ఆలోచించకుండా వెంటనే ఓకే చేశాను అని చెప్పుకొచ్చారు యావర్.వెంటనే నాగార్జున ఆ కోర్స్ నీకు ఏదైనా పనికొచ్చిందా అని అడగగా లేదు సార్ అని తెలిపారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

మరి ఇప్పుడిప్పుడే తెలుగు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న యావర్ హౌస్ మేట్స్ తో తొందరగా కలిసిపోతాడా అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తాడా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

Advertisement

తాజా వార్తలు