Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఐదవ వారం షాకింగ్ ఎలిమినేషన్.. షోపై మండిపడుతున్న ప్రేక్షకులు?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) రసవత్తరంగా సాగుతోంది.ట్విస్టుల మీద ట్విస్టులు షాకింగ్ ఎలిమినేషన్ లతో దూసుకుపోతోంది.

ఇకపోతే ఇప్పటికే నాలుగు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఐదవ వారం ముగింపు దశకు చేరుకుంది.రేపు 5వ వారం ఎలిమినేషన్స్( Fifth Week Eliminations ) లో భాగంగా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళనున్నారు.

అయితే నాలుగు వారాలకు గాను నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.ఆ నలుగురు కూడా లేడీ కంటెస్టెంట్లే కావడం ఆశ్చర్యపోవాల్సిన విషయం.

అయితే ఇలా వరుసగా నలుగురు లేడీ కంటెస్టెంట్ లు ఎలిమినేట్( Lady Contestants Elimination ) అవ్వడం అన్నది బిగ్ బాస్ చరిత్రలో ఇదే మొదటిసారి.ఇక ఐదో వారం ముగింపు దశకు చేరుకోవడంతో ఇప్పటికే ఎలిమినేషన్ కాబోయేది ఆ కంటెస్టెంట్ అంటూ పలువురు కంటెస్టెంట్ ల పేర్లు వినిపిస్తున్నాయి.అందులో ముఖ్యంగా టాప్ ఫైవ్ లో ఉంటుంది అనుకున్న కంటెస్టెంట్ ప్రియాంక( Priyanka Jain ) పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

Advertisement

గత మూడు నాలుగు వారాల్లో పవరస్త్ర గెలుచుకున్న సందీప్, శోభాశెట్టి, ప్రశాంత్ తప్ప మిగిలిన ఏడుగురు ఈ వారం నామినేట్ అయ్యారు.ఈ జాబితాలో ఓట్ల శాతం వారం మొత్తం పైకి కిందకు జరిగింది.

శుక్రవారానికి వచ్చేసరికి శివాజీ టాప్‌లోనే ఉన్నాడు.

తర్వాత స్థానాల్లో గౌతమ్, యవర్, శుభశ్రీ, టేస్టీ తేజ ఉన్నట్లు తెలుస్తోంది.చివరి రెండు స్థానాల్లో అమరదీప్, ప్రియాంక ఉన్నట్లు సమాచారం.ఈ వారం నామినేషన్స్ తర్వాత తేజ( Tasty Teja ) కి ఓటింగ్ శాతం పెరగడంతో ప్రియాంక చివరి స్థానానికి చేరుకుంది.

దాంతో ఈవారం ఆమె ఎలిమెంట్ అయ్యి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఐదవ వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఖాయం అని చెప్పవచ్చు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు